For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆసియా పసిఫిక్‌లో ధనిక దేశాలు వేగంగా పుంజుకుంటాయి: నివేదిక

|

ఆసియా-పసిఫిక్ ప్రాంతాల్లోని పేద దేశాలతో పోలిస్తే కరోనా వైరస్ సంక్షోభం ప్రభావం నుండి ధనిక దేశాలు వేగంగా కోలుకునే అవకాశం ఉందని ఏడీబీ, యూఎన్‌డీపీ, యూఎన్‌ఈఎస్‌సీఏపీ సంయుక్త నివేదిక అభిప్రాయపడింది.రోగనిరోధక స్థాయి, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, వ్యాక్సిన్ అందజేత వంటి అంశాలు ఇందుకు దోహదం చేస్తాయని ఈ నివేదిక తెలిపింది. కొన్ని దేశాలు, వర్గాలు ఇతర దేశాలతో పోలిస్తే వేగంగా పుంజుకోవడాన్ని K-ఆకృతి రికవరీగా చెబుతారు.

గతస్థాయిలో చేరుకోవడానికి ఎక్కువ సమయం

గతస్థాయిలో చేరుకోవడానికి ఎక్కువ సమయం

కొవిడ్ సంక్షోభం గతస్థాయిలో ఆదాయాలకు చేరుకోవడానికి ఎక్కువ దేశాలకు ఏళ్ల సమయం పడుతుందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రకటించిన ఉద్దీపనచర్యల్ని ముందస్తుగా వెనక్కి తీసుకోరాదని వెల్లడించింది. పలు వర్గాలకు ఆదాయ తోడ్పాటు, వేతన రాయితీలు, పన్ను చెల్లింపు వాయిదాలు, లోన్ మారటోరియం వంటి చర్యలు చేపట్టాలని వెల్లడించింది. 1995-2015 మధ్య పలు ప్రాంతాల్లో ఆదాయ సమానత్వం తగ్గగా, ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో ఐదు శాతానికి పైగా పెరిగిందని గుర్తు చేసింది.

ఆర్థిక పునరుద్ధరణ

ఆర్థిక పునరుద్ధరణ

1997-98 ఆర్థిక సంక్షోభం తర్వాత ఆర్థిక పునరుద్ధరణ ప్రక్రియను ప్రతిబింబిస్తూ కోవిడ్ 19 మహమ్మారి ప్రభావాలు అధ్వాన్నంగా ఉండే అవకాశం ఉందని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆర్థిక మద్దతును ముందస్తుగా ఉపసంహరించుకోవద్దని ఈ నివేదిక సూచించింది. నగదు బదలీలు, రాయితీలు, నిరుద్యోగ బీమా పన్ను వాయిదా, రుణ సేవలపై తాత్కాలిక నిషేధంతో పాటు ఈక్విటీ ద్వారా ఆదాయ మద్దతుతో సహా మరిన్ని చర్యలు అవసరమని పేర్కొంది.

ఆదాయ సమానత్వం

ఆదాయ సమానత్వం

1995-2015 మధ్య చాలా ప్రాంతాల్లో ఆదాయ సమానత్వం పడిపోయిందని, కానీ ఆసియా పసిఫిక్ ప్రాంంలో ఐదు శాతానికి పైగా పెరిగిందని తెలిపింది. ఈ ప్రాంతాల్లోని 40 శాతం దేశాల్లో ఆదాయ అసమానత పెరిగిందని తెలిపింది. రోగ నిరోధక శక్తి, ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల నాణ్యత, కవరేజీ, కోవిడ్ 19 వ్యాక్సీన్ రోలవుట్ వంటి అంశాలు ఆసియా పసిఫిక్ దేశాల్లో అసమానత పునరుద్ధరణకు దారి తీసే అవకాశముందని పేర్కొంది.

English summary

ఆసియా పసిఫిక్‌లో ధనిక దేశాలు వేగంగా పుంజుకుంటాయి: నివేదిక | Richer nations in Asia Pacific may recover faster than poorer counterparts post pandemic

The richer countries in the Asia-Pacific region are likely to recover quickly from the impact of the coronavirus pandemic than their poorer counterparts because of variation in degree of immunity, healthcare system and vaccine roll-out, according to a report.
Story first published: Monday, April 26, 2021, 8:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X