For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వింటారా.. తప్పదు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో ఢీ! పండుగ టైంలో మేమూ ఆఫర్లు ఇస్తాం

|

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ దిగ్గజాలు వచ్చాక వివిధ రంగాల్లోని రిటైల్ మార్కెట్ పైన దెబ్బపడుతోంది. ఈ-కామర్స్‌లో ప్రధానంగా మొబైల్ ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లు ఉండాయి. ఇది మొబైల్ రిటైలర్లను భారీగా దెబ్బతీస్తోంది. దీంతో మొబైల్ ఫోన్ రిటైలర్స్ తాజాగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌కు ధీటుగా మొబైల్ కంపెనీల ముందుకు ఓ ప్రతిపాదన తీసుకు వచ్చారు. పండుగ సమయంలో ఈ-కామర్స్ సైట్లు ఆఫర్ల పేరుతో తక్కువ ధరకు ఇస్తున్నాయని, ఆ వెసులుబాటు తమకు కూడా కల్పించాలని మొబైల్ కంపెనీలకు రిటైలర్ల సంఘం తెలిపింది.

అదిరిపోయే ఆఫర్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇది భలే ఛాన్స్.. ఎందుకంటే?అదిరిపోయే ఆఫర్: ఇల్లు కొనాలనుకుంటున్నారా, ఇది భలే ఛాన్స్.. ఎందుకంటే?

మాకూ ఇవ్వండి.. ఆఫర్లు ఇస్తాం

మాకూ ఇవ్వండి.. ఆఫర్లు ఇస్తాం

పండుగల సమయంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ కంపెనీలు మొబైల్ ఆఫర్లు భారీగా ప్రకటిస్తాయి. కొన్ని సేల్స్ పైన 30 శాతం అంత కంటే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి డీల్స్ తమ వద్ద కూడా ఉండేలా అవకాశం కల్పించాలని, పోటీలో తాము ఉండేందుకు అప్పుడే అవకాశం ఉంటుందని అఖిల భారత మొబైల్ రిటైలర్ల సంఘం (AIMRA) కోరింది. పండుగ సమయంలో ఆఫర్ వంటి అవకాశాలను ఈ-కామర్స్ సైట్లకే ఇవ్వడం వల్ల 1.5 లక్షల చిన్న వ్యాపారులు మరింతగా ఇబ్బంది పాలవుతారని తెలిపింది.

ఈ-కామర్స్ స్పెషల్ ఆఫర్లు.. రిటైలర్లకూ ఇవ్వాలి

ఈ-కామర్స్ స్పెషల్ ఆఫర్లు.. రిటైలర్లకూ ఇవ్వాలి

కంపెనీలు సాధారణ ఆఫర్లతో పాటు పండుగల సమయంలో మరింత ఆఫర్లు ప్రకటిస్తాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్ వంటి ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. ఇలాంటి ఆఫర్లతో చిన్న వ్యాపారులపై భారీగా దెబ్బపడుతోందని, ఇంకా చెప్పాలంటే సంప్రదాయ వ్యాపారాలను చంపేస్తున్నాయని అంటున్నారు. అలాంటి ఒప్పందాలు రిటైలర్లకు ఇవ్వడం లేదని, అలాంటి పక్షపాత ధోరణి లేదా వివక్ష వల్ల రిటైలర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని AIMRA ప్రెసిడెంట్ అరవిందర్ ఖురానా అన్నారు. కాబట్టి తమకూ ఇలాంటి అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు.

అల్టిమేటం

అల్టిమేటం

తమ వ్యాపారాలను దెబ్బతీయవద్దని, తమ విజ్ఞప్తిని ఆమోదించాలని కోరుతున్నారు. లేదంటే రిటైల్ వ్యాపారులు తమ వ్యాపారాన్ని కాపాడుకోవడానికి ఈ-కామర్స్ సంస్థలు ఇచ్చే ధరలకే అన్ని మోడల్ మొబైల్ ఫోన్స్ ఇచ్చే పరిస్థితి వస్తుందని, డిస్ట్రిబ్యూటర్ల అకౌంట్ల నుండి దీనిని సవరించాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే కరోనా కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

English summary

వింటారా.. తప్పదు: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో ఢీ! పండుగ టైంలో మేమూ ఆఫర్లు ఇస్తాం | Retailers, e commerce platforms should get similar deal in festive time

Mobile phone retailers have urged handset companies to allow them a level playing field by offering the same deal which e-commerce majors like Amazon and Flipkart get during the coming festive season, an official said on Wednesday.
Story first published: Thursday, September 10, 2020, 13:27 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X