Resourceful Automobile IPO: ఎస్ఎమ్ఈ కేటగిరీలో ఇటీవలి కాలంలో అనేక కంపెనీల ఐపీవోలు మార్కెట్లోకి క్యూ కడుతున్నాయి. అయితే ఈ క్రమంలో బెట్టింగ్ వేసేందుకు దిగుతున్న చాలా మంది ఇన్వెస్టర్లు అసలు కంపెనీ వ్యాపారం, ఫండమెంట్స్ వంటి కనీస విషయాలను సైతం పరిశీలించటం లేదని ఈ కంపెనీ ఐపీవో నిరూపించింది. ఇది మార్కెట్లో పెద్ద చర్చకు సైతం దారితీసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది దిల్లీకి చెందిన రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ కంపెనీ ఐపీవో గురించి. నేడు బీఎస్ఈలో కంపెనీ షేర్లు ఫ్లాట్ జాబితాను నమోదు చేశాయి. వాస్తవానికి ఇష్యూ సమయంలో కంపెనీ ఒక్కో షేరును రూ.117 ధరకు విక్రయించగా అదే రేటు వద్ద ఫ్లాట్ ప్రారంభాన్ని చూశాయి. అయితే జాబితా తర్వాత అమ్మకాల ఒత్తిడి నెలకొని కంపెనీ షేర్లు స్టాక్ దాదాపు 4.9% పడిపోయింది. ఇంట్రాడేలో రూ.111 కనిష్ఠ స్థాయికి చేరుకుంది. అయితే దీని తర్వాత కొనుగోళ్ల కోలాహలం మెుదలవ్వటంతో స్టాక్ అప్పర్ సర్క్యూట్ తాకి ఇంట్రాడేలో గరిష్ఠంగా రూ.122.85కి చేరుకుంది.

రిసోర్స్‌ఫుల్ ఆటోమొబైల్ ఐపీవో ఆగస్టు 22న ప్రారంభమై ఆగస్టు 26న ముగింసింది. ఐపీవో మార్కెట్ల నుంచి రూ.12 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా ఐపీవోకి రాగా భారీగా 500 సార్లు సబ్‌స్క్రైబ్ చేయబడింది. 2018లో దిల్లీలో స్థాపించబడిన కంపెనీ సాహ్ని ఆటోమొబైల్ బ్రాండ్ పేరుతో పనిచేస్తుంది. ఇది యమహా ద్విచక్ర వాహనాల సేల్స్ అండ్ సర్వీస్ వ్యాపారంలో ఉన్న డీలర్. డిసెంబర్ 28 నాటికి కంపెనీకి రెండు షోరూమ్‌లు, 8 మంది ఉద్యోగులు ఉన్నారు. ఐపీవో నుంచి సమీకరించిన మెుత్తాన్ని కంపెనీ రుణాల చెల్లింపులు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, దిల్లీలో కొత్త షోరూమ్ తెరిచేందుకు వినియోగించాలని నిర్ణయించింది.
ఒక చిన్న ఆటోమెుుబైల్ డీలర్ షిప్ కంపెనీ షేర్లపై ఇన్వెస్టర్లు బెట్టింగ్ వేసేందుకు విరుచుకుపడటం అంతర్జాలంలో పెద్ద చర్చకు దారితీసింది. ఈ క్రమంలో కంపెనీ కంపెనీ 9.76 లక్షల షేర్లను విక్రయించగా.. ఏకంగా 40.76 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి.
సెబీ హెచ్చరిక..
ఎస్ఎమ్ఈ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫారమ్‌లో జాబితా చేయబడిన కంపెనీలను ఆడిట్ చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని చార్టర్డ్ అకౌంటెంట్‌లను మార్కెట్ రెగ్యూలరీ SEBI హోల్‌టైమ్ మెంబర్ అశ్విని భాటియా శుక్రవారం కోరారు. ఎస్ఎమ్ఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్టింగ్, ట్రేడింగ్‌లో 'ధరల తారుమారు' గురించి మార్చిలో సెబీ చైర్‌పర్సన్ మధబి పూరి బుచ్ ఆందోళనలు లేవనెత్తుతూ పెట్టుబడిదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించిన సంగతి తెలిసిందే.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications