Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?
బంగారం అంటే భారతీయులకు ఎంతో ఇష్టం, అదొక సురక్షితమైన పెట్టుబడి అని అందరూ న

ప్రస్తుతం బంగారం మార్కెట్ ఒక తెలియని అయోమయంలో ఉంది. అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో.. బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని అందరూ భావించారు. కానీ, సీన్ రివర్స్ అయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ బంగారం ధర సుమారు $4,263 వద్ద కొనసాగుతోంది. కేవలం ఈ మార్చి నెలలోనే బంగారం ధరలు (Gold prices) దాదాపు 19.52 శాతం పడిపోయాయి. 1975 తర్వాత ఇలాంటి ఒక భారీ నెలవారీ పతనం చూడటం ఇదే మొదటిసారి.
ఈ భారీ పతనానికి గల కారణాలు..
- లిక్విడిటీ క్రైసిస్ (నగదు కొరత): సాధారణంగా మార్కెట్లు అనిశ్చితిగా ఉన్నప్పుడు బంగారం ధరలు పెరుగుతాయి. కానీ ఇప్పుడు కేవలం బంగారం మాత్రమే కాదు.. షేర్ మార్కెట్లు, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్ అన్నీ ఒకేసారి నష్టాల్లో ఉన్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఇతర చోట్ల వచ్చిన నష్టాలను పూడ్చుకోవడానికి తమ వద్ద ఉన్న బంగారాన్ని విక్రయించాల్సి వస్తోంది.
- అమెరికా డాలర్ బలోపేతం: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ భావించారు. కానీ ఇప్పుడు మళ్ళీ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే సంకేతాలు రావడంతో డాలర్ విలువ విపరీతంగా పెరిగింది. డాలర్ పెరిగితే సాధారణంగా బంగారం ధరలు తగ్గుతాయి.
- ప్రాఫిట్ బుకింగ్: గత కొంతకాలంగా బంగారం ధరలు ఆల్-టైమ్ హైలో ఉన్నాయి. ధరలు ఇంకా పడిపోకముందే లాభాలను వెనక్కి తీసుకోవాలని ఇన్వెస్టర్లు గోల్డ్ ఈటీఎఫ్ (ETFs) నుండి పెద్ద ఎత్తున నిధులను ఉపసంహరించుకుంటున్నారు.
1975లో ఏం జరిగింది?
చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, 1975-76 కాలంలో కూడా ఇలాగే భారీ పతనం సంభవించింది. అప్పట్లో బంగారం ధరలు తక్కువ సమయంలోనే విపరీతంగా పెరిగిపోయాయి. ఆ తర్వాత మార్కెట్ తనను తాను సరిదిద్దుకునే క్రమంలో (Market Correction) ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అప్పట్లో అమెరికా ప్రభుత్వం తన వద్ద ఉన్న బంగారం నిల్వలను బహిరంగ వేలం వేయడం కూడా ధరలు తగ్గడానికి ఒక ప్రధాన కారణమైంది.
ఇప్పుడు ఏం చేయాలి?
బంగారం ధరలు తగ్గడం వల్ల సామాన్య కొనుగోలుదారులకు ఇది ఒక వరమని చెప్పవచ్చు. కానీ పెట్టుబడిదారులకు మాత్రం ఇది ఒక పరీక్షా సమయం. మార్కెట్ ఒడిదుడుకుల వల్ల ధరలు ఎప్పుడు ఏ దిశగా వెళ్తాయో చెప్పడం కష్టంగా మారింది. అయితే సుదీర్ఘ కాలం (Long term) కోసం పెట్టుబడి పెట్టేవారికి ఇవి ఆందోళన కలిగించే అంశాలు కాకపోయినా, స్వల్పకాలిక ట్రేడర్లు మాత్రం అప్రమత్తంగా ఉండటం మంచిది.


Click it and Unblock the Notifications