For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank Locker: బ్యాంకులో లాకర్ ఉందా..? ఈ వార్త తెలుసుకోండి.. లేకుంటే లాకర్ ఫ్రీజ్ అవుద్ది..!

|

Bank Locker: ఈ రోజుల్లో డబ్బు, బంగారం, డాక్యుమెంట్లు ఇలా ఖరీదైన అన్ని వస్తువులు దాటుకోవటానికి ప్రజలు బ్యాంక్ లాకర్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో వాటికి డిమాండ్ తో పాటు రూల్స్ కూడా చాలా కీలకంగా మారాయి. అందుకే వీటి విషయంలో రిజర్వు బ్యాంక్ గతంలో ఒక ప్రకటన చేసింది.

బ్యాంక్ లాకర్..

బ్యాంక్ లాకర్..

వినియోగదారులు తమ బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్లను పునరుద్ధరించాలని రిజర్వు బ్యాంక్ ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇందుకోసం నూతన నిబంధనలను 2021 ఆగస్టులో అమలులోకి తెచ్చింది. వీటి ప్రకారం కొత్త అగ్రిమెంట్లను జనవరి 1, 2023 నాటికి ఖాతాదారులతో బ్యాంకులు కుదుర్చుకోవాలని నిర్ధేశించింది. అయితే.. కస్టమర్‌లు తమ ఒప్పందాలను పునరుద్ధరించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలోకి తీసుకున్న సెంట్రల్ బ్యాంక్ వారికి వెసులుబాటును కల్పించింది.

వినియోగదారుల కోసం..

వినియోగదారుల కోసం..

కస్టమర్లు తమ బ్యాంక్ ఒప్పందాల పునరుద్ధరణకు గడువును డిసెంబర్ 31, 2023 వరకు పొడిగిస్తున్నట్లు RBI సోమవారం ప్రకటించింది. లాకర్ అగ్రిమెంట్ల పునరుద్ధరణ ప్రాముఖ్యతను బ్యాంకులు తమ ఖాతాదారులకు తెలియజేయలేదని ఆర్బీఐ గుర్తించింది. అందుకే కొత్త గడువును ఈ ఏడాది చివరి వరకు పొడిగించింది. ఈ క్రమంలో బ్యాంకులు ఏప్రిల్ 30, 2023 లోపు తమ ఖాతాదారులందరికీ సవరించిన అవసరాల గురించి తెలియజేయాలని తాజా ప్రకటనలో స్పష్టం చేసింది.

కొత్త డెడ్ లైన్స్ ఇవే..

కొత్త డెడ్ లైన్స్ ఇవే..

లాకర్ల అగ్రిమెంట్ల పునరుద్ధరణకు రిజర్వు బ్యాంక్ కొన్ని డెడ్ లైన్స్ పెట్టింది. వీటి ప్రకారం జూన్ 30 నాటికి 50 శాతం, సెప్టెంబర్ 30 నాటికి 75 శాతం ఖాతాదారుల పునరుద్ధణను పూర్తి చేయాలని RBI తెలిపింది. బ్యాంకులు నెలవారీ ప్రాతిపదికన రిజర్వ్ బ్యాంక్ DAKSH పర్యవేక్షక పోర్టల్‌లో బ్యాంకులు ఈ సూచనలకు అనుగుణంగా స్థితిని అప్ డేట్ చేయాల్సి ఉంది. దీనికి తోడు జనవరి 1 నాటికి లాకర్ అగ్రిమెంట్ల పునరుద్ధరణ పూర్తి చేయనందున ఫ్రీజ్ చేయబడిన లాకర్లను వెంటనే విడుదల చేయాలని రిజర్వు బ్యాంక్ తన తాజా ప్రకటన ద్వారా దేశంలోని అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

Read more about: bank locker rbi bank news
English summary

Bank Locker: బ్యాంకులో లాకర్ ఉందా..? ఈ వార్త తెలుసుకోండి.. లేకుంటే లాకర్ ఫ్రీజ్ అవుద్ది..! | Reseve Bank Extended deadline of Locker agrements renewal to December 31, 2023

Reseve Bank Extended deadline of Locker agrements renewal to December 31, 2023
Story first published: Tuesday, January 24, 2023, 9:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X