For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దెబ్బ మీద దెబ్బ, రెనోలో 15,000 ఉద్యోగాల కోత: అందులో తొలగించినా సెప్టెంబర్ దాకా వేతనం

|

120 ఏళ్లుగా కార్లను తయారీ చేస్తున్న ఫ్రాన్స్‌కు చెందిన ప్రపంచ దిగ్గజ కంపెనీ రెనో(Renault) కూడా కరోనా మహమ్మారి కారణంగా ఉద్యోగాల కోతకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 15,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు రెనో ప్రకటించింది. ఇందులో ఫ్రాన్స్‌లోనే 4,600 మందిని, మిగతా 10,000 మందిని ఇతర దేశాల్లో తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ప్రకటన చేసింది.

ప్రతి గూగుల్ ఉద్యోగికి అదనంగా రూ.75,000, ఎందుకంటే: సుందర్ పిచాయ్ ప్రకటనప్రతి గూగుల్ ఉద్యోగికి అదనంగా రూ.75,000, ఎందుకంటే: సుందర్ పిచాయ్ ప్రకటన

వ్యయాలు తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా..

వ్యయాలు తగ్గించుకునే లక్ష్యంలో భాగంగా..

మూడేళ్లలో 200 కోట్ల యూరోల (దాదాపు రూ.16,800 కోట్లు) మేర వ్యయాలు తగ్గించుకోవాలనే లక్ష్యంలో భాగంగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు తెలిపింది. 2019లో ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల కార్లను తయారు చేసింది. 2024 వరకు ఈ సంఖ్యను 33 లక్షలకు పరిమితం చేయనుంది. ప్రస్తుతం ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1,80,000 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

వివిధ కారణాలు..

వివిధ కారణాలు..

కంపెనీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కరోనా సహా వివిధ కారణాల వల్ల ఆటోమోటివ్ ఇండస్ట్రీ సంక్షోభం, పర్యావరణ పరివర్తన వంటి వివిధ అంశాలు కంపెనీలో ఉద్యోగాల కోతకు కారణమవుతున్నాయని అభిప్రాయపడింది. సంస్థ స్థిరత్వం, దీర్ఘకాలిక అభివృద్ధిని నిర్ధారించేందుకు ప్రణాళికాబద్ధమైన మార్పులు అవసరమని చెప్పారు. చైనాలో రెనో బ్రాండెడ్ ఆయిల్ పవర్డ్ కార్ల కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది.

ఆ దెబ్బకు.. కరోనా మరో దెబ్బ

ఆ దెబ్బకు.. కరోనా మరో దెబ్బ

కరోనా వైరస్ కారణంగా రెనోపై భారీగా ప్రభావం పడింది. నిస్సాన్, మిత్సుబిషితో కలిసిన ఈ ప్రపంచ దిగ్గజ ఆటో సంస్థకు 2018లో సీఈవో కార్లోస్ ఘోస్న్ అరెస్ట్ అయినప్పటి నుండి ఇబ్బందులు పడుతోంది. రెనో 2019లో మొదటిసారి నష్టాన్ని ప్రకటించింది. ఇందులో ఫ్రెంచ్ ప్రభుత్వానికి 15 శాతం వాటా ఉంది. ఏకైక అతిపెద్ద వాటాదారు కూడా. రెనో గ్రూప్ ఇబ్బందుల్లో ఉందని ఫ్రాన్స్ మినిస్టర్ కూడా చెప్పారు.

ఈజీ జెట్‌లో 5000 మంది ఉద్యోగుల తొలగింత

ఈజీ జెట్‌లో 5000 మంది ఉద్యోగుల తొలగింత

కరోనా దెబ్బకు వివిధ అంతర్జాతీయ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఐరోపా విమానయాన సంస్థ ఈజీ జెట్ తన 15,000 మంది ఉద్యోగుల్లో మూడోవంతి మందిని అంటే 5,000 మందిని తొలగిస్తామని ప్రకటించింది. జూన్ 15న తిరిగి సర్వీసులు ప్రారంభిస్తామని, అయితే కరోనా ముందటి డిమాండ్ వచ్చేందుకు మూడేళ్లు పడుతుందని పేర్కొంది.

తొలగించినా సెప్టెంబర్ వరకు వేతనం

తొలగించినా సెప్టెంబర్ వరకు వేతనం

అమెరికా ఎయిర్ లైన్స్ 5,100 ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గత అక్టోబర్‌లో తొలగిస్తామని ప్రకటించిన వారు కూడా ఇందులో భాగమేనని తెలిపింది. అయితే సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు రాకుంటే ఈ తొలగింపులు ఉంటాయని తెలిపింది. మరో 39,000 మంది సిబ్బందికి పాక్షిక చెల్లింపు సెలవులు లేదా ముందస్తు పదవీ విరమణపై పంపిస్తున్నట్లు తెలిపింది. తొలగించిన వారికి సెప్టెంబర్ వరకు వేతనం ఇస్తామని తెలిపింది.

English summary

దెబ్బ మీద దెబ్బ, రెనోలో 15,000 ఉద్యోగాల కోత: అందులో తొలగించినా సెప్టెంబర్ దాకా వేతనం | Renault announces 15,000 layoffs worldwide

Struggling French carmaker Renault on Friday announced 15,000 job cuts worldwide as part of a 2 billion-euro cost-cutting plan over three years.
Story first published: Saturday, May 30, 2020, 10:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X