అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. లీటర్ పెట్రోల్ పైన 17 పైసలు, లీటర్ డీజిల్ పైన 21 పైసలు తగ్గింది. దీంతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.71.71, ముంబైలో రూ.77.40, కోల్‌కతాలో రూ.74.38, చెన్నైలో రూ.74.51గా ఉంది. డీజిల్ ధర లీటర్ ఢిల్లీలో రూ.64.30, ముంబైలో రూ.67.34, కోల్‌కతాలో రూ.66.63, చెన్నైలో రూ.67.86గా ఉంది.
ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్లరో పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. లీటర్ పెట్రోల్ పైన ఇప్పటి వరకు 31 శాతం వ్యాట్‌తో పాటు అదనంగా రూ.2 వసూలు చేసేవారు. ఉత్తర్వుల మేరకు ఇక నుండి వ్యాట్‌తో పాటు రూ.2.76 వసూలు చేస్తారు. అంటే లీటర్ పెట్రోల్ పైన 76 పైసలు పెరుగుతుంది.

అదేవిధంగా డీజిల్ లీటర్ పైన వ్యాట్ ప్లస్ రూ.2గా ఇప్పటి వరకు ఉంది. ఇక నుండి వ్యాట్ ప్లస్ 3.07గా సవరించారు. వ్యాట్ 22.25 శాతం వ్యాట్ ఉంది. ఇక నుండి లీటర్ డీజిల్ పైన రూ.1.07 పెరగనుంది. ఈ పెరుగుదల మార్చి 1 (ఆదివారం, నేటి నుండి) అమలులోకి వచ్చాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications