For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.19,500 కోట్లు దక్కించుకునే పనిలో టాటా-రిలయన్స్.. పోటీలో నిలబడని అదానీ..!

|

Solar Power: రానున్నది సోలార్ యుగం. విద్యుత్ పీక్ డిమాండ్ తీర్చేందుకు అదే సమయంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రభుత్వం సంసిద్ధం అవుతోంది. ఈ క్రమంలో చైనా నుంచి సోలార్ ప్యానెళ్లను దిగుమతి చేసుకోవటాన్ని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది.

కేంద్ర ప్రభుత్వం..

కేంద్ర ప్రభుత్వం..

సోలార్ ప్యానెళ్ల విషయంలో దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 2.4 బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.19,500 కోట్లను ఆర్థిక ప్రోత్సాహకంగా అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీనిని అందిపుచ్చుకునేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా పవర్, ఫస్ట్ సోలార్ వంటి అంతర్జాతీయ కంపెనీలు భారత ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమయ్యాయి.

అదానీ మాత్రం..

అదానీ మాత్రం..

ఇదే సమయంలో JSW ఎనర్జీ, అవడా గ్రూప్, రెన్యూ ఎనర్జీ గ్లోబల్ కూడా ఆసక్తిగల పార్టీలుగా నిలిచాయి. అయితే దేశంలో అతిపెద్ద సోలార్ ప్యానెల్ తయారీదారుల్లో ఒకటైన అదానీ గ్రూప్ బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొనలేదు. అనేక పొడిగింపుల తర్వాత వేలంపాటల గడువు ఫిబ్రవరి 28తో ముగిసింది. దీనికి ముందు కూడా అదానీ గ్రూప్ కొన్ని పవర్ ప్లాంట్ల విషయంలో బిడ్డింగ్ లో పాల్గొనలేదు. హిండెన్ బెర్గ్ వివాదం తర్వాత గౌతమ్ అదానీకి చెందిన కంపెనీలు తమ దూకుడును తగ్గించింది.

మోదీ సర్కార్..

మోదీ సర్కార్..

చైనాకు ప్రత్యామ్నాయంగా ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియాకు రూపకల్పన చేశారు. కరోనా నేపథ్యంలో ఏర్పడిన సప్లైచైన్ అంతరాయాల వల్ల చైనాపై అధికంగా ఆధారపడిన కంపెనీలు, దేశాలు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా మోదీ సర్కార్ అందిస్తున్న ప్రోత్సాహకాలు భారత్ ను ప్రపంచ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ గా మార్చటంలో భాగంగా ఉందని తెలుస్తోంది. ఇది ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లటంతో పాటు ఉద్యోగాల కల్పనకు, విదేశీ దిగుమతులను తగ్గించుకునేందుకు దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 2025 నాటికి..

2025 నాటికి..

2025 నాటికి సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తిలో భారత్ 95 గిగావాట్ల స్థాయికి చేరుకుంటుందని తెలుస్తోంది. గత సంవత్సరం సెప్టెంబర్ నాటికి దేశంలో సోలార్ ప్యానెళ్ల ఉత్పత్తి సామర్థ్యం 39 గిగావాట్లుగా ఉందని తాజా నివేదికల ప్రకారం వెల్లడైంది. అయితే ఈ రంగంలో రూ.94,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని కేంద్ర ప్రభుత్వం గత సెప్టెంబరులో నిర్ధేశించుకుంది. దీనికోసం పీఎల్ఐ స్కీమ్ కింద రూ.19,500 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను అందించాలని యూనియన్ క్యాబినెట్ నిర్ణయించింది.

English summary

రూ.19,500 కోట్లు దక్కించుకునే పనిలో టాటా-రిలయన్స్.. పోటీలో నిలబడని అదానీ..! | Reliance, Tata in race to get 19500 crores worh incentives as Adani group Drops

Reliance, Tata in race to get 19500 crores worh incentives as Adani group Drops
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X