For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IPL 2023: ఐపీఎల్ ప్రియులకు పెద్ద వార్త.. ఆ సేవలను ఉచితంగా అందించనున్న రిలయన్స్..!

|

IPL 2023: ఇండియన్స్ కి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అది ఎంతంటే ఆ రెండింటికి మధ్య ఉన్న బంధాన్ని విడదీయలేనంత. ఈ క్రమంలో పారంభమైన ఐపీఎల్ దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ సంపాదించింది. ఇటీవల ఐపీఎల్ ఆటగాళ్ల వేలం పూర్తికాగా.. త్వరలోనే 2023 సీజన్ ప్రారంభం కాబోతోంది.

రిలయన్స్ జియో..

రిలయన్స్ జియో..

లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ మార్కెట్లో పెను సంచలనంగా మారాలని నిర్ణయించినట్లు సమాచారం. గత సంవత్సరం JioCinema యాప్‌లో FIFA వరల్డ్ కప్ మ్యాచ్ లను పూర్తిగా ఉంచి ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షకులకు అందించింది. దేశంలోని అతిపెద్ద టెల్కో ఇప్పుడు ఐపీఎల్ విషయంలోనూ ఇదే స్ట్రాటజీని ఫాలో అవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. రానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని చూస్తోంది.

2022 సీజన్లో..

2022 సీజన్లో..

రిలయన్స్ యాజమాన్యంలోని వయాకామ్ 18 ఐపీఎల్ 2023 నుంచి 2027 సీజన్ల ప్రసారానికి హక్కులను 2022లోనే కొనుగోలు చేసింది. దీంతో డిజిటల్ మీడియా హక్కులను దక్కించుకునేందుకు రిలయన్స్ గ్రూప్ ఏకంగా రూ.23,758 కోట్లను వెచ్చించింది. ఫుట్‌బాల్ టోర్నమెంట్ డిజిటల్ హక్కులను Viacom18 కలిగి ఉన్నందున JioCinema అన్ని FIFA ప్రపంచ కప్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని అందించింది. ప్రేక్షకులు వీటిని యాప్ తో పాటు Sports18, Sports18 HD వంటి టీవీ ఛానెళ్లలోనూ ప్రసారం చేయటం మనందరికీ తెలిసిందే.

మార్కెట్ పెనిట్రేషన్..

మార్కెట్ పెనిట్రేషన్..

మెుదటి నుంచి రిలయన్స్ జియో గ్రూప్ తన సేవలను వినియోగదారులకు పరిచయం చేసేందుకు పెనిట్రేటింగ్ స్ట్రాటజీని ప్రయోగిస్తోంది. తాజాగా లైవ్ స్పోర్ట్స్ స్ట్రీమింగ్ మార్కెట్‌ విషయంలోనూ ఇదే పద్దతిని అవలంభించాలని చూస్తోంది. దీనికోసం Viacom18 అనేక వ్యూహాలను అన్వేషిస్తోందని మూలాల ద్వారా తెలుస్తోంది. రిలయన్స్ కూడా మార్కెట్ వాటాను కార్నర్ చేయడానికి ఉచితంగా ఉత్పత్తులను అందించవచ్చని నివేదిక జోడించింది.

ప్రాంతీయ భాషల్లో..

ప్రాంతీయ భాషల్లో..

Viacom18 దేశంలోని ప్రాంతీయ భాషల్లో IPLని ఉచితంగా ప్రసారం చేయాలని యోచిస్తోంది. జియో టెలికాం సబ్‌స్క్రైబర్లు లైవ్ స్ట్రీమ్‌ను ఉచితంగా యాక్సెస్ చేయగలరని తెలుస్తోంది. అయినప్పటికీ కంపెనీ ఇప్పటికీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లు, ప్యాకేజీలను అందించడం కొనసాగిస్తుందని సమాచారం. మెుత్తానికి మార్కెట్ ను ఒడిసిపట్టేందుకు రిలయన్స్ జియో తన పాత అస్త్రాన్నిమళ్లీ తెరమీదకు తెస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

English summary

IPL 2023: ఐపీఎల్ ప్రియులకు పెద్ద వార్త.. ఆ సేవలను ఉచితంగా అందించనున్న రిలయన్స్..! | Reliance JIO planning to livestream IPL 2023 matched for free

Reliance JIO planning to livestream IPL 2023 matched for free
Story first published: Thursday, January 12, 2023, 18:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X