For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Reliance Jio: అద్దిరిపోయే ప్లాన్..అప్పుగా డేటా: ఎమర్జెన్సీ లోన్ స్కీమ్

|

ముంబై: దేశంలో టాప్ అండ్ లార్జెస్ట్ టెలికం ఆపరేటర్‌గా గుర్తింపు పొందిన రిలయన్స్ జియో ఓ అద్దిరిపోయే డేటా ప్లాన్‌ను ఆవిష్కరించింది. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో సాఫ్ట్‌వేర్ సహా దాదాపు అన్ని సెక్టార్లకు చెందిన కార్యాలయాలు మూతపడటం.. ఉద్యోగులందరూ వర్క్ ఫ్రమ్ హోమ్‌కు పరిమితమైన నేపథ్యంలో- పెరిగిన డేటా వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ జియో యాజమాన్యం దీన్ని రూపొందించింది. డేటా కొనుగోలు చేయడానికి రుణాన్ని ఇచ్చే సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనికి ఎమర్జెన్సీ డేటా లోన్ అని పేరు పెట్టింది.

ఈ ప్లాన్ కింద..

ఈ ప్లాన్ కింద..

రీఛార్జ్ నౌ అండ్ పే లేటర్ (Recharge Now and Pay Later) ప్రాతిపదిన ఈ ప్లాన్‌ను రూపొందించింది. ఈ ప్లాన్ కింద- ఒక జియో మొబైల్ నంబర్‌ వినియోగదారుడు.. అయిదు ఎమర్జెన్సీ డేటా లోన్ ప్యాక్‌ల వరకు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పించింది. ఒక్కో ప్యాక్ ధర 11 రూపాయలు. ఒక జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్యాక్‌ను మై జియో యాప్ ద్వారా (MyJio app) యూజర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. యూజర్లకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో- ఈ ప్లాన్‌ను రూపొందించినట్లు రిలయన్స్ జియో యాజమాన్యం తెలిపింది.

 ఇన్‌స్టంట్ యాక్సెస్..

ఇన్‌స్టంట్ యాక్సెస్..

జియో యూజర్లు.. తమ రోజువారీ డేటా స్పీడ్ లిమిట్‌ను దాటిన తరువాత కూడా.. మరింత అవసరం పడితే- ఈ ప్లాన్ కింద ప్రకటించిన లోన్ ప్యాక్‌లను కొనుగోలు చేయవచ్చు. అప్పటికప్పుడు తమ డేటాను రీఛార్జ్ చేసుకోవడానికి వీల్లేని పరిస్థితులను ఎదుర్కొంటోన్న యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్‌గా అభివర్ణించింది రిలయన్స్ జియో యాజమాన్యం. వర్క్ ఫ్రమ్ హోమ్ పరిస్థితులు, విద్యార్థులు ఇంట్లో నుంచే ఆన్‌లైన్ ద్వారా తరగతులకు హాజరవుతోన్న నేపథ్యంలో ఈ డేటా ప్లాన్.. వారికి మరింత ఉపకరిస్తుందని వ్యాఖ్యానించింది.

 ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే..

ఎలా రీఛార్జ్ చేసుకోవాలంటే..

1. తొలుత మై జియో యాప్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. అనంతరం మెను సెక్షన్‌లోకి ఎంటర్ కావాలి. ఈ సెక్షన్.. హోమ్ పేజీలో ఎడమవైపు టాప్‌లో ఉంటుంది. 2. అందులో మొబైల్ సర్వీసెస్ ఆప్షన్‌‌లో పొందుపరిచిన ఎమర్జెన్సీ డేటా లోన్ అనే అక్షరాలపై క్లిక్ చేయాల్సి ఉంటుంది. 3. అక్కడే ప్రొసీడ్ అనే అక్షరాలపై క్లిక్ చేయాలి. 4. ఆ తరువాత గెట్ ఎమర్జెన్సీ డేటా అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. 5. ఆ తరువాత ప్రత్యక్షమయ్యే యాక్టివ్ నౌ అనే బటన్‌ను క్లిక్ చేయాలి. 6. ఆ వెంటనే ఆటోమేటిక్‌గా డేటా రీఛార్జ్ యాక్టివేట్ అవుతుంది. 7. ఆ తరువాత ఇచ్చిన గడువులోగా దీనికి మైజియో యాప్ ద్వారానే డబ్బులను చెల్లించాల్సి ఉంటుంది.

English summary

Reliance Jio: అద్దిరిపోయే ప్లాన్..అప్పుగా డేటా: ఎమర్జెన్సీ లోన్ స్కీమ్ | Reliance Jio has launched an 'emergency data loan' as recharge now, pay later

Reliance Jio has launched an 'emergency data loan' facility for its users. Through this facility, users who have run out of data and cannot recharge immediately can get access to instant data and pay for it later, similar to taking a loan from a bank.
Story first published: Saturday, July 3, 2021, 17:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X