For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రిలయన్స్ జియో సరికొత్త రికార్డ్, ప్రపంచంలోనే 5వ బలమైన బ్రాండ్

|

భారత టెలికం దిగ్గజం రిలయన్స్ జియో మరో ఘనతను సాధించింది. 2016లో ప్రారంభమైన జియో అనతికాలంలోనే ఇతర టెల్కోలను దాటి నెంబర్ వన్ స్థాయికి ఎదిగింది. తక్కువ కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఫెరారీ, కోకాకోలా వంటి కంపెనీల సరసన రిలయన్స్ జియో చేరింది. ప్రపంచ బలమైన బ్రాండ్స్‌లో జియో 5వ స్థానంలో నిలిచింది. బ్రాండ్ ఫైనాన్స్ గ్లోబల్ 500 ర్యాంకింగ్‌లో జియో చోటు దక్కించుకుంది.

ఈ జాబితాలో చైనాకు చెందిన వీ-చాట్ మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా ఫెరారీ, ఎస్‌బీఈఆర్, కోకాకోలా, రిలయన్స్ జియో నిలిచాయి. నాలుగేళ్ల కాలంలోనే రిలయన్స్ జియో 40 కోట్ల సబ్‌స్క్రైబర్లను దాటింది. జియో తక్కువ కాలంలోనే భారత అతిపెద్ద మొబైల్ నెట్ వర్క్ ఆపరేటర్‌గా, ప్రపంచంలో మూడో ఆపరేటర్‌గా నిలిచింది.

Reliance Jio Emerges as Fifth Strongest Company in Brand Finance Global 500 2021 Report

జియో మొదటిసారి ఈ జాబితాలోకి చేరిందని, ప్రపంచ 5వ బలమైన బ్రాండ్‌గా నిలిచిందని ఈ నివేదిక తెలిపింది. BSI స్కోర్ 91.7, ఏఏఏ ప్లస్ రేటింగ్ పొందింది. వీ-చాట్ బ్రాంట్ స్ట్రెంత్ ఇండెక్స్(BSI) 95.4గా ఉంది. ప్రపంచంలోనే విలువైన బ్రాండ్‌గా వెరిజోన్ నిలిచింది.

దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్దటీజ్ టీసీఎస్, ప్రపంచ బ్రాండ్లలో 3వ స్థానం, కాగ్నిజెంట్‌ను వెనక్కి నెట్టిన ఇన్ఫోసిస్

English summary

రిలయన్స్ జియో సరికొత్త రికార్డ్, ప్రపంచంలోనే 5వ బలమైన బ్రాండ్ | Reliance Jio Emerges as Fifth Strongest Company in Brand Finance Global 500 2021 Report

Telecom major Reliance Jio is the fifth strongest brand in the world, shows the 'Brand Finance Global 500 2021' report.
Story first published: Thursday, January 28, 2021, 21:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X