For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డౌన్‌లోడ్ వేగంలో రిలయన్స్ జియో టాప్

|

అక్టోబర్ నెలలో రిలయన్స్ జియో సగటు డౌన్ లోడ్ స్పీడ్ 17.8Mbpsతో మరోసారి ముందు నిలిచింది. టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా ప్రకారం జియో డౌన్ లోడ్ స్పీడ్ సెప్టెంబర్ నెలలో రికార్డ్ స్థాయి 19.1Mbps నుండి 17.8Mbpsకు తగ్గింది. జియో తర్వాత ఐడియా సగటు డౌన్ లోడ్ వేగం 9.1Mbpsగా ఉంది. ట్రాయ్ మైస్పీడ్ పోర్టల్ ప్రకారం అంతకుముందు రికార్డ్ స్పీడ్ 8.6Mbpsతో పోలిస్తే 0.5Mbps ఎక్కువ. రిలయన్స్ జియో 4G డౌన్ లోడ్ స్పీడ్ సెప్టెంబర్ నెలతో పోలిస్తే అక్టోబర్ నెలలో 1.5Mbps తగ్గినప్పటికీ అగ్రస్థానంలోనే ఉంది.

8.8Mbps స్పీడ్‌తో వొడాఫోన్ మూడో స్థానంలో ఉంది. సెప్టెంబర్ నెలలో దీని వేగం 7.9Mbpsగా ఉంది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్‌కు చెందిన మైస్పీడ్ పోర్టల్ ప్రకారం వొడాఫోన్, ఐడియాలు ఇప్పటికి వేర్వేరు టెలికం కంపెనీలుగా పేర్కొంటూ స్పీడ్ డేటాను అందిస్తోంది.

 Reliance Jio dominates 4G download speeds at 17.8Mbps: TRAI

ట్రాయ్ మైస్పీడ్ పోర్టల్ ప్రకారం జియో, ఐడియా తర్వాత వొడాఫోన్ 4G డౌన్ లోడ్ స్పీడ్‌లో మూడో స్థానంలో ఉంది. భారతీ ఎయిర్‌టెల్ యావరేజ్ డౌన్ లోడ్ స్పీడ్ 7.5Mbpsగా ఉంది. వరుసగా రెండు నెలలు ఇలాగే ఉంది.

ఇక, అప్ లోడ్ వేగంలో 6.5Mbps స్పీడ్‌తో వొడాఫోన్, 5.9Mbps ఐడియా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. మూడో స్థానంలో 3.8Mbpsతో ఎయిర్‌టెల్, జియో 3.5Mbpsతో చివరి స్థానంలో నిలిచింది.

ఇదిలా ఉండగా, రిలయన్స్ జియో చందాదారులు 40 కోట్లు దాటారు. ప్రపంచవ్యాప్తంగా ఒక దేశంలో 40 కోట్ల చందాదారులను కలిగి ఉన్న సంస్థగా జియో రికార్డును నెలకొల్పింది. రిలయన్స్ జియో ప్రకారం ఈ టెలికం సంస్థకు 40.56 కోట్ల చందాదారులు ఉన్నారు. ఏడాది ప్రాతిపదికన 13.96 శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో 35.59 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ త్రైమాసికంలో 73 లక్షలమంది కొత్త చందాదారులు చేరారు.

English summary

డౌన్‌లోడ్ వేగంలో రిలయన్స్ జియో టాప్ | Reliance Jio dominates 4G download speeds at 17.8Mbps: TRAI

With an average download speed of 17.8Mbps, Reliance Jio continued to dominate in 4G download speeds in October, new data from Telecom Regulatory Authority of India (TRAI) has said.
Story first published: Monday, November 16, 2020, 19:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X