ఫోర్బ్స్ గ్లోబల్ 2000 జాబితాలో 53వ స్థానంలో రిలయన్స్
ప్రపంచవ్యాప్తంగా లిస్టెడ్ కంపెనీలలో అగ్రగామి సంస్థలతో ఫోర్బ్స్ వెలువరిచిన తాజా గ్లోబల్ 2000 జాబితాలో ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ రెండు ర్యాంకులు ముందుకు వచ్చి 53వ స్థానానికి చేరుకుంది. కంపెనీ విక్రయాలు, లాభాలు, ఆస్తులు, మార్కెట్ వ్యాల్యూను పరిగణలోకి తీసుకొని ఈ జాబితాను సిద్ధం చేశారు. ఈ జాబితాలో దేశీయంగా టాప్ 1 సంస్థగా రిలయన్స్ నిలిచింది.
ఈ జాబితాలో ఎస్బీఐ 105వ స్థానంలో, HDFC బ్యాంకు 153వ స్థానంలో, ఐసీఐసీఐ బ్యాంకు 204వ స్థానంలో, ఓఎన్జీసీ 228వ స్థానంలో, HDFC 268వ స్థానంలో, ఐవోసీ 357వ స్థానంలో, టీసీఎస్ 384వ స్థానంలో, టాటా స్టీల్ 407వ స్థానంలో, యాక్సిస్ బ్యాంకు 431వ స్థానంలో ఉన్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ గత ఆర్థిక సంవత్సరంలో 104.6 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాలను రిలయన్స్ నమోదు చేసింది.

56.12 బిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూతో ఎస్బీఐ దేశంలో రెండో అతిపెద్ద సంస్థగా నిలిచింది. ఎస్బీఐకీ 24వేల శాఖలు, 62,617 ఏటీఎంలు ఉన్నాయి. ప్రయివేటు బ్యాంకులు HDFC బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకులు ఆ తర్వాత మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నాయి. వేదాంత 703 ర్యాంకులు మెరుగుపడి 593వ స్థానంలోకి వచ్చింది. షేర్ వ్యాల్యూ పెరగడం కలిసి వచ్చింది.