For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెజార్టీ వాటాలు... మరో సంస్థను సొంతం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ తాజాగా స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్ జాయింట్ వెంచర్‌ను కొనుగోలు చేసింది. ఐఎంజీ వరల్డ్ వైడ్ ఎల్ఎల్‌సీతో కలిసి నిర్వహిస్తున్న IMG-Rను రిలయన్స్ సొంతం చేసుకుంది. IMG-R వరల్డ్ వైడ్‌కు చెందిన 50 శాతం వాటాలను రిలయన్స్ రూ.52.08 కోట్లకు దక్కించుకుంది. ఈ మేరకు రిలయన్స్ గురువారం స్టాక్ ఎక్స్చేంజీకి తెలియజేసింది. ఈ డీల్ పూర్తిగా నగదు రూపంలో జరిగినట్లు వెల్లడించింది. డీల్ పూర్తయ్యాక IMG-Rను రిలయన్స్ రీబ్రాండింగ్ చేయనుంది.

టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!టేక్ హోం శాలరీ తగ్గుతుంది, కంపెనీలకు భారం: కొత్త వేతన చట్టం వద్దేవద్దు!

2010లో స్థాపన

2010లో స్థాపన

IMG సింగపూర్ లిమిటెడ్‌ సబ్సిడరీయే IMG-R. ఇందులో 50 శాతం వాటా కలిగి ఉంది. ఇప్పుడు తన వాటాను విక్రయించింది. డీల్ పూర్తయితే మొత్తం రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి వస్తుంది. దేశంలో క్రీడలు, వినోద రంగాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం, మార్కెటింగ్ చేయడం కోసం 2010లో రిలయన్స్-IMG వరల్డ్ వైడ్ సంయుక్తంగా IMG-Rను ప్రారంభించాయి. గత పదేళ్లుగా పలు క్రీడా వినోద కార్యక్రమాలను నిర్వహించి ప్రమోట్ చేసింది. ఇప్పుడు మిగిలిన 50 శాతం వాటాను రిలయన్స్ దక్కించుకుంది.

ముందే జరిగిన ఒప్పందం

ముందే జరిగిన ఒప్పందం

షేర్ల కొనుగోలుకు సంబంధించి కంపెనీతో ఒప్పందం జరిగిందని, రూ.52.08 కోట్లకు మించకుండా IMG సింగపూర్ పీటీఈకి చెందిన వాటాను కొనుగోలు చేస్తామని, ఈ డీల్ తర్వాత కంపెనీని రీబ్రాండింగ్ చేస్తామని రిలయన్స్ తెలిపింది. ముందే చేసుకున్న ఒప్పందం కారణంగా ఎలాంటి క్లియరెన్స్ అవసరం లేదని కూడా తెలిపింది.

మంచి లాభాలు...

మంచి లాభాలు...

గత మూడేళ్లుగా సంస్థ మంచి లాభాలు నమోదు చేస్తోంది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో టర్నోవర్ రూ.181.70 కోట్లు కాగా, నికర లాభం రూ.16.35 కోట్లు, 208-19లో టర్నోవర్ రూ.195.55 కోట్లు కాగా, నికర లభం రూ.19.25, 2017-18లో టర్నోవర్ రూ.158.26 కోట్లు కాగా నికర లాభం రూ.15.82 కోట్లుగా ఉంది. కాగా, రిలయన్స్ షేర్ నిన్న 2.58 శాతం లాభపడి రూ.1993.90 వద్ద క్లోజ్ అయింది.

English summary

మెజార్టీ వాటాలు... మరో సంస్థను సొంతం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ | Reliance Industries to acquire 50 percent stake in IMGR

Reliance Industries Ltd (RIL) has entered into a definitive agreement to acquire 50% shares held by IMG Singapore Pte. Ltd in IMG-Reliance Ltd, for a cash consideration not exceeding ₹52.08 crore, the company said in a regulatory filing today.
Story first published: Friday, December 25, 2020, 19:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X