For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Reliance: పెప్సీ-కోక్ లకు చుక్కలే.. అంబానీ మరో కంపెనీ కొనుగోలు.. 100 ఏళ్లనాటి బ్రాండ్..!!

|

Mukesh Ambani: తన రిటైల్ వ్యాపారా సామ్రాజ్య విస్తరణను కొత్త సంవత్సరంలోనూ ఎలాంటి బ్రేక్ లేకుండా కొనసాగిస్తున్నారు అంబానీ. ఇందులో భాగంగా 100 ఏళ్ల నాటి ప్రసిద్ధ శీతల పానీయాల కంపెనీలో వాటాలను కొంటున్నారు. ఈ వ్యూహాత్మక పెట్టుబడి కోకాకోలా, పెప్సీకోల మార్కెట్ ను తీవ్రంగా దెబ్బతీసేందుకు చేస్తున్న ప్లాన్ అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

స్వాధీనంలో బ్రాండ్స్..

స్వాధీనంలో బ్రాండ్స్..

రిలయన్స్ వ్యూహాత్మక పెట్టుబడితో స్వాధీనం చేసుకున్న Sosyo Hajoori Beverages Pvt Ltd (SHBPL) కంపెనీకి.. సోస్యో, కాశ్మీరా, లెమీ, గిన్‌లిమ్, రన్నర్, ఓపెనర్, హజూరి సోడా, సియా వంటి అనేక పానీయాల బ్రాండ్లు ఉన్నాయి. ఇవి రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వ్యాపార వృద్ధిలో భాగం కావటం వల్ల కంపెనీకి మేలు జరగనుంది. గుజరాత్ కేంద్రంగా పనిచేస్తున్న కంపెనీని గుజరాతీ వ్యాపారి అంబానీ దక్కించుకున్నారు. ఈ డీల్ ద్వారా కంపెనీలోని 50 శాతం వాటాను రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కొనుగోలు చేసింది.

100 ఏళ్ల హిస్టరీ..

100 ఏళ్ల హిస్టరీ..

శీతల పానీయాల తయారీలో తయారీలో 100 ఏళ్ల ప్రస్థానం కలిగిన సోస్యోను 1923లో అబ్బాస్ అబ్దుల్‌రహీం హజూరి స్థాపించారు. ప్రస్తుతం కంపెనీని ఆయన కుమారుడు నిర్వహిస్తున్నారు. ఈ బ్రాండ్‌ను మొదట్లో 'సోషియో' అని పిలిచేవారు. సూరత్‌లో ఇది ప్రజాదరణ పొందడంతో.. పేరును పలికేందుకు వీలుగా సోస్యోగా 1953లో మార్చారు.

స్వచ్చమైన గుజరాతీ..

స్వచ్చమైన గుజరాతీ..

కంపెనీ ఉత్పత్తులకు గుజరాత్‌లో కస్టమర్ బేస్‌ను కలిగి ఉంది. రిలయన్స్ తో డీల్ ద్వారా కంపెనీ తమ 100 ఏళ్ల నాటి పానీయాల రుచులను భారత నలుమూలలకూ విస్తరించాలని భావిస్తున్నట్లు సోస్యో హజూరి బేవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ అబ్బాస్ హజూరి అన్నారు. కంపెనీకి దేశవ్యాప్తంగా మెుత్తం 18 తయారీ యూనిట్లు ఉన్నాయి.

కంపెనీ పంపిణీ నెట్‌వర్క్‌లు..

కంపెనీ పంపిణీ నెట్‌వర్క్‌లు..

కంపెనీకి దేశంలో మెుత్తం 16 ఫ్రాంచైజీ అవుట్‌లెట్స్ ఉన్నాయి. దీనికి తోడు అమెరికా, యూకే, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, UAEతో సహా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ జాతీయ బ్రాండ్ గా మారాలను ఉవ్విళ్లూరుతోంది. కంపెనీకి కేవలం గుజరాత్ రాష్ట్రంలోనే 29 శాతం వాటా శీతల పానీయాల మార్కెట్ ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 20 లక్షల బాటిళ్లను విక్రయిస్తోంది. గ్రూప్ దేశమంతటా 95,000 అవుట్‌లెట్లకు సేవలు అందిస్తోందని కంపెనీ వెల్లడించింది.

రిలయన్స్ గత డీల్..

రిలయన్స్ గత డీల్..

రిలయన్స్ గ్రూప్ ఆగస్టు 2022లో దిల్లీకి చెందిన ప్యూర్ డ్రింక్స్ గ్రూప్ నుంచి స్వదేశీ శీతల పానీయాల బ్రాండ్ కాంపా కోలాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా కాంపా కోలా తర్వాత సోస్యో కంపెనీలో వాటాలను కొనుగోలు చేస్తోంది. అయితే ఈ డీల్ విలువ దాదాపూ రూ.22 కోట్లకు జరిగినట్లు తెలుస్తోంది. రిలయన్స్ తన ఎఫ్‌ఎంసీజీ విభాగంలో తన విస్తరణ డ్రైవ్‌లో భాగంగా కేటగిరీలోని పలు బ్రాండ్‌లతో చర్చలు జరుపుతోంది. దీనికి తోడు ఇండిపెండెన్స్ పేరుతో కంపెనీ ఎఫ్‌ఎంసీజీ వ్యాపారంలోకి అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

English summary

Reliance: పెప్సీ-కోక్ లకు చుక్కలే.. అంబానీ మరో కంపెనీ కొనుగోలు.. 100 ఏళ్లనాటి బ్రాండ్..!! | Reliance industries buying 50 percent stake in gujarat based beverage maker SOSYO

Reliance industries buying 50 percent stake in gujarat based beverage maker SOSYO
Story first published: Wednesday, January 4, 2023, 18:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X