ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగం రిలయన్స్ రిటైల్ మరో మెగా డీల్ కుదుర్చుకుంది. కిషోర్ బియానీకి చెందిన ప్యూచర్ గ్రూప్, హోల్‌సేల్, లాజిస్టిక్, వేర్‌హౌసింగ్ విభాగాలను రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ కొనుగోలు చేస్తోంది. ఈ మేరకు ప్రకటన చేసింది. ఈ ఒప్పందం వ్యాల్యూ రూ.24,713 కోట్లు. రిటైల్ వ్యాపారాన్ని మరింత వేగంగా విస్తరించడంతో పాటు ఈ-కామర్స్ రంగంలో అమెజాన్ నుండి ఎదురవుతున్న పోటీని తట్టుకునే ఉద్దేశ్యంలో భాగంగా ఈ కొనుగోలు జరిపినట్లుగా భావిస్తున్నారు.

బిగ్ బజార్ సహా ఇవి రిలయన్స్ చేతికి.. ఒప్పందంలో ఇవి లేవు
ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్ విభాగాల్ని కొనుగోలు చేయడంతో ఈ రంగంపై మరింత దృష్టి సారించడానికి వీలవుతుందని రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ డైరెక్టర్ ఈషా అంబానీ అన్నారు. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ 1,800 స్టోర్స్ కలిగి ఉందని, ఇప్పుడు ప్యూచర్ గ్రూప్‌కు చెందిన మరో 1,800 స్టోర్స్ జత కలుస్తున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 420కి పైగా నగరాల్లో విస్తరించాయి. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన బిగ్ బజార్, ఈజీడే, బ్రాండ్ ఫ్యాక్టరీకి చెందిన ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్ విభాగాలు రిలయన్స్ రిటైల్‌తో కలుస్తాయి. కాగా, తయారీ, ఇంటిగ్రేటెడ్ ఫ్యాషన్ సోర్సింగ్, ఇన్సూరెన్స్ విభాగాలు మాత్రమే ఫ్యూచర్ గ్రూప్ కింద ఉంటాయి.

13 శాతం వాటా.. ఇక అనుమతి తరువాయి
ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్‌లో 13 శాతానికి పైగా వాటాను కూడా సొంతం చేసుకుంది రిలయన్స్ రిటైల్. ఈ ఒప్పందం కాంపోజిట్ స్కీం ఆఫ్ అరేంజ్‌మెంట్ కింద జరుగుతుందని, కొనుగోలు విలువలో సర్దుబాటు ఉండవచ్చునని వెల్లడించింది. ప్రతిపాదిత కొనుగోలు ఫ్యూచర్ గ్రూప్ చేపట్టిన విలీనంలో భాగంగా ఉండనుంది. ఈ ఒప్పందానికి సెబి, సిసిఐ, ఎన్సీఎల్టీ, షేర్ హోల్డర్స్ అనుమతి లభించాల్సి ఉంది. దేశంలో విస్తరిస్తున్న రిటైల్ వ్యాపారాన్ని మరింత పెంచుకోవడంతో పాటు అమెజాన్ నుండి పోటీని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి ఈ-కామర్స్ వ్యాపారంలో మరింత పోటీని పెంచే దిశగా రిలయన్స్ ముందుకు సాగుతోంది. 2017లో 800 బిలియన్ డాలర్లుగా ఉన్న మన దేశ రిటైల్ మార్కెట్ 2026 నాటికి 1.75 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. కరోనా, ఆర్థిక పరిస్థితుల మూలంగా తలెత్తిన సవాళ్లకు, పునర్వ్యవస్థీకరణ, తాజా లావాదేవీ ఫలితంగా సంస్థకు సంపూర్ణపరిష్కారం లభిస్తుందని ఫ్యూచర్ గ్రూప్ సీఈవో కిషోర్ బియానీ అన్నారు.

కొనుగోలు ఇలా..
కాంపొజిట్ స్కీమ్ ఆఫ్ అరేంజ్‌మెంట్ స్కీంలో భాగంగా రిలయన్స్ ఈ కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగా ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ వ్యాపారాల్ని ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో విలీనం చేస్తుంది. ఫ్యూచర్ గ్రూప్ రిటైల్, హోల్‌సేల్ వ్యాపారాలు రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ పూర్తి అనుబంధ విభాగమైన రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్‌స్టైల్ లిమిటెడ్‌కు బదిలీ అవుతాయి. లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్ విభాగాలు నేరుగా రిలయన్స్ రిటైల్ వెంచర్ లిమిటెడ్ బదిలీ కానున్నాయి. ఈ డీల్‌లో భాగంగా రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్ పెట్టుబడులు పెట్టనుంది. విలీనం తర్వాత ఫ్యూచర్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌లో 6.09% వాటా కోసం ఈక్విటీ షేర్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూలో రూ.1,200 కోట్లు, ఈక్విటీ వారంట్ల ప్రిఫరెన్షియల్ ఇష్యూలో మరో రూ.400 కోట్లు. వీటిని ఈక్విటీగా మార్చుకోవడం ద్వారా మరో 7.05 శాతం వాటా లభిస్తుంది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications