For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు ఆఫర్ ఇస్తున్న ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ నివేదిక సారాంశంఇదేనా !!

|

కరోనా మహమ్మారి పంజా విసురుతున్న సమయంలో బ్యాంకింగ్ రంగంలో సంస్కరణలను తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే . అందుకు అనుగుణంగా ఆర్బీఐ కూడా ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ అందించిన సమాచారం మేరకు బడా కార్పోరేట్ లకు పెద్ద ఆఫర్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది . రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మొదటిసారిగా కార్పొరేట్ సంస్థలు పేమెంట్ బ్యాంకు ఏర్పాటుకు ఆహ్వానించినట్లుగా తెలుస్తుంది . బడా పారిశ్రామిక సంస్థలకు విభిన్న బ్యాంకింగ్ లైసెన్సుల కోసం అనుమతులు కూడా ఇవ్వనున్నట్టు తెలుస్తుంది.

 ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రం నజర్ .. ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ సాధ్య ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణపై కేంద్రం నజర్ .. ఈ ఆర్ధిక సంవత్సరం నాలుగు బ్యాంకుల ప్రైవేటీకరణ సాధ్య

బడా కార్పొరేట్ సంస్థలకు ప్రైవేటు రంగ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి యోచన

బడా కార్పొరేట్ సంస్థలకు ప్రైవేటు రంగ బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి యోచన

తాజాగా ఆర్బిఐ బడా కార్పొరేట్ సంస్థలకు ప్రైవేటు రంగ బ్యాంకుల ఏర్పాటు కూడా అనుమతి ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ప్రైవేటు రంగంలో బ్యాంకింగ్ దిగ్గజాలు హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులు బ్యాంకింగ్ రంగంలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో మరిన్ని ప్రైవేట్ రంగ బ్యాంకులకు అనుమతి ఇచ్చే ఆలోచనలో ఆర్బిఐ ఉన్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రభుత్వ రంగ బ్యాంకులలోని వాటాలను ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని, ప్రైవేటు సంస్థల పెట్టుబడులను బ్యాంకింగ్ రంగంలో ఆహ్వానించాలని భావిస్తున్న ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఆర్బీఐ కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది.

 ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ నివేదికలో కార్పోరేట్ సంస్థలకు బ్యాంక్ ప్రమోటర్లు గా అవకాశం

ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ నివేదికలో కార్పోరేట్ సంస్థలకు బ్యాంక్ ప్రమోటర్లు గా అవకాశం

యాజమాన్య మార్గదర్శకాలను మరియు భారత ప్రైవేటు రంగ బ్యాంకుల కార్పొరేట్ నిర్మాణాన్ని సమీక్షించడానికి జూన్‌లో ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూప్ కమిటీ నవంబర్ 20 శుక్రవారం తన నివేదికను విడుదల చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 1949 కు అవసరమైన సవరణల తరువాత మాత్రమే పెద్ద కార్పొరేట్ , పారిశ్రామిక సంస్థలను బ్యాంకుల ప్రమోటర్లుగా అనుమతించవచ్చు అని కమిటీ సూచించింది. కమిటీ సమర్పించిన నివేదికలో భారత ప్రైవేటు రంగ బ్యాంకులు మార్గదర్శకాలు , కార్పొరేట్ నిర్మాణం పై ప్రస్తావించింది.

 బడా కార్పోరేట్ సంస్థలకే అవకాశం .. నివేదికలో చెప్పింది అదే

బడా కార్పోరేట్ సంస్థలకే అవకాశం .. నివేదికలో చెప్పింది అదే

అంతేకాకుండా 50 వేల కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణంతో కొనసాగుతున్న నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, పదేళ్ల కార్యకలాపాల అనుభవం ఉన్న కార్పొరేట్ హౌస్ లు ఉన్న సంస్థలను బ్యాంకులుగా మార్చేందుకు అవకాశం ఇవ్వచ్చు అని నివేదిక పేర్కొంది. ఏది ఏమైనా ఆర్బీఐ కూడా ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే, ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థను ముందుకు తీసుకు రావడం కోసం పెద్ద ఆఫర్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.

Read more about: rbi report ఆర్‌బిఐ
English summary

దిగ్గజ కార్పోరేట్ సంస్థలకు ఆఫర్ ఇస్తున్న ఆర్బీఐ ఇంటర్నల్ వర్కింగ్ గ్రూప్ నివేదిక సారాంశంఇదేనా !! | RBI working group Committee Suggests Allowing Corporates as bank promoters

RBI's working group committee, which was formed in June to review ownership guidelines and the corporate structure of Indian private sector banks, released its report. Large corporate/industrial houses may be allowed as promoters of banks only after necessary amendments to the Banking Regulation Act, 1949, the committee suggested.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X