For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI MPC meeting: వడ్డీ రేట్లు యథాతథంగా ఉండే అవకాశం

|

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈసారి కీలక వడ్డీ రేట్లలో మార్పులు చేయకపోవచ్చునని ఆర్థిక నిపుణుల అంచనా. ఆర్బీఐ పరపతి విధాన కమిటీ సమావేశం బుధవారం (జూన్ 3) ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలను శుక్రవారం రోజున ఆర్బీఐ వెల్లడిస్తుంది. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ వృద్ధి అంచనాలపై అనిశ్చితి నెలకొన్నది. ఇలాంటి సమయంలో ఆర్బీఐ నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

కరోనా పరిణామాలు, అధిక ద్రవ్యోల్బణం భయాల కారణంగా ఆర్బీఐ కీలక రేట్లను యథాతథంగా ఉంచే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఏప్రిల్ 4వ తేదీన జరిగిన సమావేశంలో ఆర్బీఐ కీలక రేట్లలో మార్పులు చేయలేదు.

RBI MPC on June 4: Repo rate likely to be unchanged, say experts

జీడీపీ వృద్ధి గణాంకాలు అంచనాలకు మించి సానుకూలంగా నమోదైన నేపథ్యంలో భవిష్యత్తు వృద్ధి అంచనాలను లెక్కగట్టే విషయంలో MPCకి కొంత అనుకూలత ఏర్పడిందంటున్నారు. అయితే కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు వివిధ రాష్ట్రాలు విధించిన లాక్‌డౌన్, కరోనా ఆంక్షలు ఆర్థిక వ్యవస్థ రికవరీపై దెబ్బతీశాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ సర్దుబాటు వైఖరిని కొనసాగిస్తుందంటున్నారు.

English summary

RBI MPC meeting: వడ్డీ రేట్లు యథాతథంగా ఉండే అవకాశం | RBI MPC on June 4: Repo rate likely to be unchanged, say experts

The Reserve Bank of India’s (RBI) bi-monthly monetary policy review is scheduled from June 2-4 with Governor Shaktikanta Das expected to announce the Monetary Policy Committee’s (MPC) decisions on June 4.
Story first published: Thursday, June 3, 2021, 7:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X