For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI Monetary Policy: వడ్డీ రేట్లు యథాతథం, జీడీపీ 10.5%

|

ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) శుక్రవారం (ఫిబ్రవరి 5) ద్రవ్య విధాన సమీక్ష ఫలితాలను వెల్లడించారు. కీలక వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచింది ఆర్బీఐ. ఈ మేరకు శక్తికాంతదాస్ ప్రకటన చేశారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయడం లేని తెలిపారు. మందగమనం, కరోనా కారణంగా రెపో రేటు 4 శాతానికి దిగి వచ్చింది. దీనిలో మార్పులు చేయలేదు. అలాగే, 2021-22 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 10.5 శాతంగా ఉండవచ్చునని అంచనా వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 26.2 శాతం నుండి 8.3 శాతం వరకు, మూడో త్రైమాసికంలో 6 శాతంగా నమోదు కావొచ్చునని అంచనా వేశారు.

సీపీఐ ద్రవ్యోల్భణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో 5.2 శాతంగా అంచన వేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ సంవత్సరంలో 5.2 శాతం నుండి 5 శాతానికి అంచనా వేశారు. మూడో త్రైమాసికంలో 4.3 శాతంగా ఉండవచ్చునని తెలిపారు. కూరగాయల ధరలు దాదాపు ఇలాగే ఉండవచ్చునని ఎంపీసీ అంచనా వేసింది.

RBI Monetary Policy: RBI keeps policy repo rate unchanged, GDP forecast at 10.5 percent

ఆర్థిక వ్యవస్థలో అవసరమైన లిక్విడిటీకి ఆర్బీఐ సిద్ధమని శక్తికాంత దాస్ తెలిపారు. అవసరానికి అనుగుణంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రభుత్వ రుణ ప్రణాళికలకు సంబంధించి మార్కెట్ అడ్డంకులు లేకుండా కేంద్ర బ్యాంకు చూస్తుందని తెలిపారు.

English summary

RBI Monetary Policy: వడ్డీ రేట్లు యథాతథం, జీడీపీ 10.5% | RBI Monetary Policy: RBI keeps policy repo rate unchanged, GDP forecast at 10.5 percent

The Indian markets were holding on to their gains near their fresh lifetime highs on Friday after the Reserve Bank of India kept the repo rate unchanged at 4 per cent while the stance remained 'accomodative'. Besides, the RBI projected GDP growth of 10.5 per cent in FY22 for India while projection for CPI-based inflation was revised to 5.2 per cent for Q4FY21.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X