For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

RBI: దిగ్గజ బ్యాంకులపై కన్నెర్ర చేసిన రిజర్వు బ్యాంక్.. భారీ పెనాల్టీ.. ఎందుకంటే..

|

RBI Penalty On Banks: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సోమవారం కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లపై రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు చర్యలు చేపట్టింది. దిగ్గజ ప్రైవేట్ లెండర్లపై సుమారు రూ. కోటి చొప్పున జరిమానా విధించింది. దీనితో పాటు.. నాలుగు సహకార బ్యాంకులకు కూడా జరిమానా విధించాలని రిజర్వ్ బ్యాంక్ నిర్ణయించింది. ఈ క్రమంలో కోటక్ మహీంద్రా బ్యాంకుపై రూ.1.05 కోట్ల జరిమానా విధించినట్లు రిజర్వ్ బ్యాంక్ తెలిపింది.

డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్ స్కీమ్- 2014 నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినందుకు, వినియోగదారుల రక్షణ, లోన్స్, అనధికార ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ లావాదేవీల్లో అడ్వాన్స్‌లకు సంబంధించిన నిబంధనలను పాటించనందుకే ఈ జరిమానా విధించటం జరిగింది. 'నో యువర్ కస్టమర్' (KYC) నిబంధనలను పాటించనందుకు ఇండస్‌ఇండ్ బ్యాంక్‌కు మార్కెట్ రెగ్యులేటర్ సెబీ రూ.కోటి జరిమానా విధించింది.

rbi imposed penalty on kotak mahindra bank and indusind bank along with co-operative banks

ఇది కాకుండా.. RBI నాలుగు సహకార రంగ బ్యాంకులపై కూడా జరిమానా విధించింది. నవజీవన్ కో-ఆపరేటివ్ బ్యాంక్, బలంగీర్ డిస్ట్రిక్ట్ సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్., ధాకురియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, కోల్‌కతా అండ్ పళని కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ వీటిలో ఉన్నాయి. వీరికి లక్ష నుంచి రెండు లక్షల రూపాయల వరకు జరిమానాలు పడ్డాయి. అయితే, పెనాల్టీ విధించే నిర్ణయం నియంత్రణ సమ్మతిలో లోపాలను బట్టి ఉంటుందని, తమ ఖాతాదారులతో బ్యాంకులు జరిపిన లావాదేవీలు లేదా ఒప్పందాల చెల్లుబాటును ప్రశ్నించడం లేదని రిజర్వ్ బ్యాంక్ పేర్కొంది.

English summary

RBI: దిగ్గజ బ్యాంకులపై కన్నెర్ర చేసిన రిజర్వు బ్యాంక్.. భారీ పెనాల్టీ.. ఎందుకంటే.. | rbi imposed penalty on kotak mahindra bank and indusind bank along with co-operative banks

rbi imposed penalty on banks for not complying with the norms
Story first published: Tuesday, July 5, 2022, 9:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X