For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Raghuram Rajan: భారత బ్యాంకులు జర జాగ్రత్తగ ఉండాలె.. రాజన్ హెచ్చరిక వెనుక..?

|

Raghuram Rajan: భారత రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ సమయానుకూలంగా ఆర్థిక వ్యవస్థకు సూచనలు, హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నందున దావోస్ 2023 కార్యక్రమానికి వచ్చిన ఆయన ఇంటర్వ్యూలో భారత బ్యాంకింగ్ రంగం తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడారు.

బ్యాంకులు జాగ్రత్తగుండాలె..

బ్యాంకులు జాగ్రత్తగుండాలె..

గతంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగానికి భారీగా లోన్స్ ఇవ్వటం వల్ల ఉన్న సమస్యల గురించి రాజన్ హెచ్చరించారు. అందులో ఉండే నష్టాలను బ్యాంకులు తనిఖీ చేసేలా చూడాలని అన్నారు. అయితే ప్రస్తుతం దేశంలోని బ్యాంకులు రిటైల్ రుణాల విషయంలో చాలా దూకుడుగా ముందుకు సాగటం గురించి కూడా హెచ్చరించారు. ఆర్థిక వ్యవస్థలో డౌన్ సైకిల్ నడుస్తున్నందున రాబోయే ప్రమాదాలను గమనించి ముందుకు సాగాలని సూచించారు.

సూటి ప్రశ్నలు..

సూటి ప్రశ్నలు..

ప్రస్తుతం భారత బ్యాంకులు రిటైల్ రుణాలవైపు భారీగా మెుగ్గుచూపుతున్నాయి. అయితే ఈ క్రమంలో వాటి ధర సరిగా ఉందా..? దీనిలో ఉండే నష్టాలను బ్యాంకులు గమనిస్తున్నాయా..? అనే విషయాలపై ప్రశ్నలు సంధించారు. ఇటీవల రిటైల్ లోన్స్ మార్కెట్ పై దృష్టి పెరగటంతో ఇప్పుడు ఆర్బీఐ మాజీ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. తప్పుడు అంచనాలతో ముందుకు వెళితే బ్యాంకులు భారీగా నష్టాలను చవిచూడాల్సి ఉంటుందని రాజన్ వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.

గతంలో ఇలా..

గతంలో ఇలా..

2007-2009 మధ్య కాలంలో మౌలిక సదుపాయాల రంగం భాగా రాణించింది. ఆ సమయంలో చాలా బ్యాంకులు ఆ రంగంలోని చాలా సంస్థలకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. కానీ.. ఆ తర్వాత బూమ్ క్రాష్ కావటంతో బ్యాంకులు చాలా ఎదురుదెబ్బలు తిన్న విషయాన్ని రాజర్ గుర్తుచేశారు. అసెట్ క్వాలిటీ ఫ్రంట్‌పై మాట్లాడుతూ రీపేమెంట్ విషయంలో కొంత మేర గణనీయమైన పురోగతి సాధించామని అభిప్రాయపడ్డారు.

చిన్న వ్యాపారులు..

చిన్న వ్యాపారులు..

కరోనా సమయంలో చిన్న మధ్యతరహా వ్యాపారులు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అయితే ఆ సమయంలో బ్యాంకులకు నిరర్ధక ఆస్తులు పెరగలేదు. చిన్న వ్యాపారులు వారి లోన్స్ తిరిగి చెల్లించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు గుర్తించటం జరిగింది. అయితే ప్రస్తుతం గత కొంత కాలంగా పరిస్థితులు చెడ్డగా ఉన్నందున కొంత జాగ్రత్త తప్పనిసరని రాజ్ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులతో ఉన్న ప్రధాన సమస్య ఏమిటంటే.. వారు ఎప్పటికప్పుడు ఇబ్బందుల్లో పడేందుకు కొత్త మార్గాలను వెతుకుంతుంటారని రాజన్ అన్నారు. సమస్యలను సృష్టించకుండా ఉండేందుకు బ్యాంకులు పని చేయగలిగిన వాటిలో ఒకటి రుణాలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండటమేనని అభిప్రాయపడ్డారు.

English summary

Raghuram Rajan: భారత బ్యాంకులు జర జాగ్రత్తగ ఉండాలె.. రాజన్ హెచ్చరిక వెనుక..? | RBI ex governor Raghuram Rajan warned Indian banks over retail lending boom

RBI ex governor Raghuram Rajan warned Indian banks over retail lending boom
Story first published: Thursday, January 19, 2023, 11:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X