For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శ్రీలంక సంక్షోభంతో కళ్లుతెరిచిన RBI.. రాష్ట్రాల అప్పులపై అధ్యయనం.. ఏపీ పరిస్థితి ఏమిటంటే..

|

RBI Report: కరోనా తరువాత చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు కకలావికలం అయ్యాయి. అవి కతంలో చేసిన తప్పులకు ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటున్నాయి. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల్లో పరిస్థితులు రోజురోజుకూ అధ్వానంగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై దృష్టి సారించింది. రిజర్వు బ్యాంక్ నివేదిక ప్రకారం.. బీహార్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ ఆర్థికంగా అత్యంత ఒత్తిడికి గురైన రాష్ట్రాల్లో ఉన్నాయి. పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, హర్యానా భారతదేశంలో అత్యధికంగా రుణ భారం ఉన్న రాష్ట్రాలుగా నిలిచాయి.

అధ్వానంగా పంజాబ్ పరిస్థితి..

అధ్వానంగా పంజాబ్ పరిస్థితి..

ఇటీవల శ్రీలంక సంక్షోభం తర్వాత.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను ఆర్‌బీఐ వివరంగా అధ్యయనం చేసింది. కొవిడ్ -19 మహమ్మారి కారణంగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించిందని అధ్యయనంలో తేలింది. ముఖ్యంగా.. నగదు రాయితీలు, ఉచిత యుటిలిటీ సేవలను అందించడం, పాత పెన్షన్ స్కీమ్ పునరుద్ధరణ, అనేక హామీల పొడిగింపుపై రాష్ట్రాల ధోరణి వాటిని ఒక విచిత్ర స్థితిలో ఉంచింది.

2011-12 నుంచి 2019-20 మధ్య కాలంలో రాష్ట్రాల సగటు GFD-GDP నిష్పత్తి 2.5% వద్ద ఉందని RBI నిర్ధారించింది. ఇది ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ లెజిస్లేషన్ (FRL) సీలింగ్ 3% కంటే తక్కువ. జీఎస్డీపీలో అప్పుల శాతం పెరగటం రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చాయి. రుణ-GSD నిష్పత్తి 2021-22, 2026-27 మధ్య మధ్యస్థంగా ఉంటుందని ఆర్‌బీఐ అంచనా వేసింది.

గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్నాటక, ఒడిశా రాష్ట్రాల ఆర్థిక పనితీరుకు ఇది ప్రాథమికంగా నిష్పత్తిలో మోడరేషన్ కారణమని పేర్కొంది. అంచనాల ప్రకారం.. 2026-27లో రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్‌లు 35% కంటే ఎక్కువ నిష్పత్తి కలిగి ఉంటాయని అంచనా వేయగా.. పంజాబ్ అత్యంత అధ్వాన స్థితిలోనే ఉంటుందని RBI అంచనా వేసింది.

అధిక మూలధన వ్యయం..

అధిక మూలధన వ్యయం..

ఖర్చుల విషయానికి వస్తే.. రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాలు ఆదాయ ఖాతాలపై దాదాపు 90% ఖర్చు చేస్తాయి. ఆర్థిక కార్యకలాపాలపై ఆదాయ వ్యయాల ప్రభావం దాదాపు ఒక సంవత్సరం పాటు ఉంటుంది. ఈ రాష్ట్రాలు మూలధన వ్యయ నిష్పత్తులకు అధిక ఆదాయ వ్యయాన్ని కలిగి ఉన్నాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్థిక కార్యకలాపాలపై దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి. గరిష్ఠ ప్రభావం రెండు మూడు సంవత్సరాల తర్వాత కనిపిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

ఉచితాలతో ఆర్థిక చిక్కులు..

ఉచితాలతో ఆర్థిక చిక్కులు..

ఉచిత విద్యుత్, నీరు, ప్రజా రవాణా, వ్యవసాయ రుణాల మాఫీ వంటి ఉచితాలు, క్రెడిట్ ని నాశనం చేస్తున్నాయి. క్రాస్-సబ్సిడైజేషన్ ద్వారా ధరలను వక్రీకరిస్తాయి. ప్రైవేట్ పెట్టుబడులకు ప్రోత్సాహకాలను దెబ్బతీస్తాయి. పనిని నిర్వీర్యం చేస్తాయని RBI తెలిపింది. దీనిపై రాష్ట్రాలు తక్షణం స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని రిజర్వు బ్యాంక్ సూచిస్తోంది. పెరుగుతున్న ఆర్థిక ఒత్తిడి సంకేతాను హెచ్చరికలుగా పరిగణించాలని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. కరోనా వల్ల రాష్ట్రాలకు టాక్స్ రాబడులు తగ్గడం, సబ్సిడీల భారం, అధిక అప్పులు, పెరుగుతున్న వడ్డీ వ్యయాలు ఇందుకు ప్రధాన కారణాలుగా రిజర్వు బ్యాంక్ వెల్లడించింది.

English summary

శ్రీలంక సంక్షోభంతో కళ్లుతెరిచిన RBI.. రాష్ట్రాల అప్పులపై అధ్యయనం.. ఏపీ పరిస్థితి ఏమిటంటే.. | rbi conducted study over states financial stress and rising burden of loans after srilanka crisis

reserve bank of india conducted study over rising financial stress in few states after srilanka financial meltdown
Story first published: Thursday, June 23, 2022, 16:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X