For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీడియా ముందుకు దాస్: ఈఎంఐ, క్రెడిట్ కార్డు పేమెంట్స్‌పై RBI భారీ ఊరట?

|

ముంబై: ఆర్బీఐ చీఫ్ శక్తికాంతదాస్ కాసేపట్లో మీడియాతో మాట్లాడనున్నారు. ఈ మేరకు ఆర్బీఐ ట్వీట్ చేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో నీడీపీపుల్‌ను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఏం మాట్లాడుతారనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ చెల్లింపులకు సంబంధించి ఊరట ఇచ్చే ప్రకటన చేస్తారనే ప్రచారం సాగుతోంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఎవరూ బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ కారణంగా ఉద్యోగులపై, వ్యాపారులపై ఒత్తిడి లేకుండా మూడు లేదా ఆరు నెలల పాటు ఊరట కల్పించవచ్చునని భావిస్తున్నారు.

మళ్లీ తగ్గిన బంగారం ధరలు, ఈ రోజు ధర ఎంతంటే?మళ్లీ తగ్గిన బంగారం ధరలు, ఈ రోజు ధర ఎంతంటే?

మేం లోన్లు కట్టలేం

మేం లోన్లు కట్టలేం

ప్రస్తుత పరిస్థితుల్లో లోన్లు కట్టలేని, క్రెడిట్ కార్డు చెల్లింపులు చేయలేని పరిస్థితి ఉందని కాబట్టి కాస్త ఊరట కల్పించాలని చాలామంది కోరుతున్నారు. క‌రోనా దెబ్బ‌కు విలవిల్లాడుతున్న వ్యాపార‌స్తులు బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులు చెల్లించే ప‌రిస్థిలో లేమ‌ని ఇప్పటికే చేతులెత్తేస్తున్నారు.

ఈ రంగాలు కుదేలు

ఈ రంగాలు కుదేలు

రియ‌ల్ ఎస్టేట్‌, పర్యాటక, ఆతిథ్య‌రంగాల వ్యాపారాలు కరోనాతో కుదేల‌య్యాయి. వీటితో పాటు మరెన్నో రంగాలు నష్టాల్లో ఉన్నాయి. వ్యాపారాలు పూర్తిగా మూత ప‌డ‌టంతో క‌నీసం ఉద్యోగుల‌కు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి ప‌రిస్థితుల్లో వ్యాపారాల కోసం బ్యాంకుల వ‌ద్ద తీసుకున్న అప్పుల‌కు వాయిదాలు చెల్లించ‌లేమ‌ని ప‌లు సంస్థ‌ల నిర్వాహ‌కులు చేతులెత్తేస్తున్నారు.

వాయిదా పద్ధతుల్లో..

వాయిదా పద్ధతుల్లో..

కరోనా మహమ్మారి కారణంగా మూడు వారాల లాక్ డౌన్ దేశ భద్రత కోసమే. కానీ సామాన్య, మధ్య తరగతికు మాత్రం ఈఎంఐ, క్రెడిట్ కార్డు పేమెంట్స్ టెన్షన్ పట్టుకుంది. కాబట్టి ఆర్బీఐ ప్రెస్ మీట్ ఈ దిశగానే ఉంటుందని భావిస్తున్నారు. కొద్ది రోజులు తమ పేమెంట్స్ ఆపాలని కోరుతున్నారు. సోషల్ మీడియాలోను ఈ దిశగా స్పందిస్తున్నారు. నెల సంపాదన ఆధారంగా చాలామంది హోమ్ లోన్, వెహికిల్ లోన్, ఇతర లోన్స్ తీసుకొని, ఈఎంఐలు చెల్లిస్తుంటారు.

English summary

మీడియా ముందుకు దాస్: ఈఎంఐ, క్రెడిట్ కార్డు పేమెంట్స్‌పై RBI భారీ ఊరట? | RBI chief with Media: expectations on EMIs, credit card payments?

RBI Governor Shaktikanta Das will address a press conference on Friday, a day after the Centre announced a Rs 1.7 lakh crore economic package for the country’s poor hit hardest by the coronavirus pandemic.
Story first published: Friday, March 27, 2020, 9:08 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X