For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రయివేటు బ్యాంకు MD, CEO వయో పరిమితి 70 ఏళ్లు, ఆర్బీఐ తాజా ఆదేశాలు

|

ప్రయివేటురంగ బ్యాంకుల్లో కార్పోరేట్ గవర్నెన్స్ ప్రమాణాలను కట్టుదిట్టం చేసే దిశగా ఆర్బీఐ మరో అడుగు వేసింది. ప్రయివేటు రంగ బ్యాంకుల MD, CEO, హోల్ టైమ్ డైరెక్టర్ల పదవీ కాలాన్ని పరిమితం చేసింది. వీరి పదవీ కాలాన్ని 15 ఏళ్లుగా, గరిష్ట వయస్సును 70 ఏళ్లుగా నిర్ణయించింది. బోర్డు చైర్మన్, సమావేశాలు, బోర్డు కమిటీలో సభ్యుల నిష్పత్తి, వయస్సు, పదవీ కాలం, డైరెక్టర్ల పారితోషికం, పూర్తికాల డైరెక్టర్ల నియామకాలకు సంబంధించి ఆర్బీఐ జారీ చేసిన నిబంధనల్లో భాగంగా సోమవారం వీటిని జారీ చేసింది.

పదిహేనేళ్లకు మించి ఉండవద్దు

పదిహేనేళ్లకు మించి ఉండవద్దు

బ్యాంకుల్లో కార్పొరేట్ గవర్నెన్స్ పైన మాస్టర్ డైరెక్షన్స్‌తో వస్తామని ఆర్బీఐ తెలిపింది. అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి MD, CEO లేదా పూర్తికాల డైరెక్టర్ల నియామకాలను(WTD) పదిహేనేళ్లకు మించి ఒకే పదవిలో ఉంచలేరని పేర్కొంది. ఒకవేళ అదే వ్యక్తులను పునర్నియామకానికి బోర్డు ఆమోదిస్తే కనుక కనీసం మూడేళ్ల వ్యవధి తర్వాత కొన్ని షరతులకు లోబపడి నియమించుకోవచ్చునని ఆర్బీఐ తెలిపింది.

అయితే ఈ మూడేళ్ల కాలంలో ఆయా వ్యక్తులు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బ్యాంకుతో లేదా అనుబంధ కంపెనీలతో ఎలాంటి సంబంధం లేదా నియామకాలను చేపట్టరాదని ఆదేశించింది. సీఈవో, ఎండీ, WTD గరిష్ట పరిమితి 70 ఏళ్లకు మించవద్దని తెలిపింది. అంతకంటే తక్కువ వయస్సు లోపే పదవీ విరమణను బోర్డులు సూచించవచ్చునని పేర్కొంది.

వారికి 75 ఏళ్లు

వారికి 75 ఏళ్లు

చైర్మెన్, నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల(NED) గరిష్ట వయోపరిమితిని 75 ఏళ్లుగా నిర్ణయించింది. NEDల మొత్తం పదవీకాలం నిరంతరం లేదా బ్యాంకు బోర్డులో ఎనిమిదేళ్లకు మించి ఉండకూడదు. ఆ తర్వాత వీరి పునర్నియామకానికి కనీసం మూడేళ్లు ఆగాలని ఆర్బీఐ తెలిపింది. అలాగే NEDల వార్షిక వేతనం రూ.20 లక్షలకు మించరాదని ఆదేశించింది.

పదవీ కాలం తగ్గించుకోవచ్చు

పదవీ కాలం తగ్గించుకోవచ్చు

అవసరమైతే అవసరమైతే ఎండీ, సీఈవో, డబ్ల్యూటీడీల రిటైర్మెంట్ పదవీ కాలాన్ని తగ్గించుకునే అధికారం కూడా బ్యాంకు బోర్డులకు ఉందని తెలిపింది. త్వరలో బ్యాంకుల్లో కార్పొరేట్ పాలనపై మాస్టర్ డైరెక్షన్‌ను చేస్తామని వెల్లడించింది రిజర్వ్ బ్యాంకు. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతోనే బ్యాంకు ఆడిట్ కమిటీ బోర్డు ఏర్పాటు అవుతుందని తెలిపింది.

English summary

ప్రయివేటు బ్యాంకు MD, CEO వయో పరిమితి 70 ఏళ్లు, ఆర్బీఐ తాజా ఆదేశాలు | RBI caps private bank CEO tenure at 15 years

The Reserve Bank of India (RBI) has capped the tenure of managing directors (MDs) and chief executive officers (CEOs) and whole-time directors (WTDs) of private banks at 15 years from the date of appointment.
Story first published: Tuesday, April 27, 2021, 9:46 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X