For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా ప్రభావాన్ని అతిగా ఊహించారా?: అమెరికా బిలియనీర్ ఏమన్నారంటే?

|

కరోనా వైరస్ కారణంగా చైనాలో వెయ్యి మందికి పైగా మృత్యువాత పడ్డారు. 30వేల మందికి పైగా ఈ వైరస్ సోకింది. కరోనా భయంతో చైనాలో ఎన్నో ఉత్పాదక కంపెనీలు తాత్కాలికంగా మూతబడ్డాయి. సేవా రంగాలు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాయి దాదాపు నెల రోజులుగా చైనాతో పాటు ప్రపంచదేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఈ ప్రభావం మార్కెట్లపై కూడా పడింది. 2002లో వచ్చిన సార్స్ కంటే అతి ప్రమాదకారిగా చెబుతున్నారు. కరోనా కారణంగా చైనా జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోతుందని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఎక్కువ పాన్‌కార్డులుంటే రూ.10,000 జరిమానా, ఫైన్ తప్పించుకునేందుకు ఇలా చేయాలి?ఎక్కువ పాన్‌కార్డులుంటే రూ.10,000 జరిమానా, ఫైన్ తప్పించుకునేందుకు ఇలా చేయాలి?

చాలా ఎక్కువ చేశారు..

చాలా ఎక్కువ చేశారు..

కరోనా వైరస్ ప్రభావం చైనా.. తద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఉంటుందనే ఆందోళనలపై అమెరికన్ బిలియనీర్ రేడాలియో స్పందించారు. ప్రపంచ మార్కెట్లపై కరోనా వైరస్ ప్రభావాన్ని చాలా ఎక్కువ చేసి చూపారన్నారు. ఇలాంటి భయాలు ఎక్కువ కాలం నిలిచేవి కావని చెప్పారు. ఇలాంటి వ్యాధులు వచ్చినప్పుడు సాధారణంగా అందరిలో ఉండే భయాలే మార్కెట్లకు, ఇన్వెస్టర్లకు కలుగుతాయన్నారు.

రీబౌండ్ ఉండదు..

రీబౌండ్ ఉండదు..

కానీ కరోనా వైరస్ భయాన్ని మార్కెట్లు చాలా ఎక్కువగా స్వీకరించాయన్నారు. ఇక నుండి సూచీల్లో రీబౌండ్ ఉండదని ఆయన చెప్పారు. ఒకటి రెండేళ్లలో ఈ విషయాన్ని అంతా మరిచిపోతారన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతుందని, చైనాను సాంకేతక మాంద్యంలోకి నెడుతుందని, ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను కూడా తీవ్ర ప్రభావితం చేస్తుందని హెచ్చరించారన్నారు. ఈ వైరస్ కారణంగా దాదాపు 10 శాతం మార్కెట్లు నష్టపోయాయి. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటున్నాయి.

బ్రిడ్జ్‌వాటర్

బ్రిడ్జ్‌వాటర్

బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకులైన రేడాలియో అబుదాబిలోని ఓ సదస్సులో మాట్లాడారు. ప్రపంచ హెడ్జ్ ఫండ్స్‌లలో బ్రిడ్జ్‌వాటర్ అత్యుత్తమ రిటర్న్స్ అందిస్తోంది. దాదాపు నాలుగున్నర దశాబ్దాలుగా ఈ ఫండ్ భారీ లాభాల పంట పండించింది. గత ఏడాది ఆశించిన ప్రదర్శన చేయలేదు.

కరోనా ఎఫెక్ట్

కరోనా ఎఫెక్ట్

చైనా ప్రావిన్సులోని 80 శాతం డీజీపీ, 90 శాతం ఎగుమతులను కలిగి ఉన్న ప్రాంతంపై కరోనా వైరస్ ప్రభావం ఉంది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయినా చైనాలో వివిధ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని సూచించాయి. ఇటీవలే కరోనా ప్రభావం తగ్గుతోంది.

English summary

కరోనా ప్రభావాన్ని అతిగా ఊహించారా?: అమెరికా బిలియనీర్ ఏమన్నారంటే? | Ray Dalio says market impact of coronavirus is exaggerated

Ray Dalio says the impact of the coronavirus outbreak on markets has been exaggerated and is likely to be short lived.
Story first published: Wednesday, February 12, 2020, 13:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X