For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Ratan Tata: పాత మధుర జ్ఞాపకాన్ని పంచుకున్న రతన్ టాటా.. నెటిజన్లు ఫిదా.. చూడాల్సిందే బాస్

|

Ratan Tata: టాటాల వ్యాపార సామ్రాజ్యాన్ని విజయవంతంగా ముందుకు నడపటంలో రతన్ టాటా చాలా కీలకంగా వ్యవహరించారు. దేశం కోసం చాలా విషయాలను ఆయన త్యాగం చేశారు. తన పూర్తి జీవితాన్ని టాటాల వారసత్వాన్ని దేశానికి ఉపయోగపడేలా చేయటంలోనే గడిపారు.

చిన్ననాటి జ్ఞాపకం..

చిన్ననాటి జ్ఞాపకం..

మనందరికీ తెలుసు రతన్ టాటా ఒక పెట్ లవర్ అని. చాలా సార్లు ఖాళీ సమయంలో ఆయన పెంపుకు కుక్కలతో గడిపిన చిత్రాలు మనకు సామాజిక మాద్యమాల్లో అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. దీనికి తోడు టాటా గొప్ప మానవతా వాది కూడా. తన సోదరుడు పెట్ తో కలిసి దిగిన పాత చిత్రాన్ని టాటా పంచుకున్నారు.

చిన్నతనంలో రతన్..

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా ఒక్కసారిగా తన చిన్ననాటి జ్ఞాపకాల్లోకి వెళ్లారు. అలా తన తమ్ముడు జిమ్మీతో కలిసి మెస్మరైజింగ్, హృదయాన్ని కదిలించే ఒక చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోకు "అవి సంతోషకరమైన రోజులు" అనే అందమైన క్యాప్షన్ కూడా పెట్టారు. ఆ చిత్రంలో క్యూట్ గా టాటాతో పాటు ఆయన సోదరుడు, ఒక కుక్క కనిపిస్తుంది. దీనిని చూసిన చాలా మంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

స్వాతంత్య్రానికి ముందు..

స్వాతంత్య్రానికి ముందు..

ప్రస్తుతం రతన్ టాటా పంచుకున్న చిత్రం స్వాంత్య్రానికి ముందరిది. రతన్ టాటా యుక్తవయసులో తన సోదరుడు జిమ్మీ టాటాతో కలిసి వారి కుక్కతో సైకిల్‌పై వెళ్తున్న చిత్రం అది. క్యాప్షన్‌లో రతన్ టాటా పేర్కొన్నట్లుగా ఈ చిత్రం 1945లో తీయబడింది. మనమూ చిన్ననాటి ఫొటోలు చూసినప్పుడు ఒక్కసారిగా కాలం వెనక్కి తిరుగినట్లు అనిపిస్తుంది. ఎల్లప్పుడూ బిజీగా గడిపే టాటా గతకాలంలోకి తొంగిచూస్తూ తనకు ఎంతగానో నచ్చిన ఒక మెమరీని అందరితో పంచుకున్నారు.

నెటిజన్ల ప్రేమ..

నెటిజన్ల ప్రేమ..

రతన్ టాటా తన తమ్ముడితో ఉన్న పాత చిత్రానికి నెటిజన్ల నుంచి ప్రశంసలతో పాటు ప్రేమ కూడా కురిపిస్తున్నారు. దీనిపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. "అద్భుతమైన చిత్రం, మీరు మా అందరికీ స్ఫూర్తి సర్. నేను ఒక రోజు మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను" అని కామెంట్ చేశాడు. మరికొందరైతే ఇదొక విలువైన & అమూల్యమైన ఫొటో అంటూ కామెంట్ చేశాడు. యువరాజ్ వాల్మీకి అనే హాకీ ప్లేయర్ కామెంట్ సెక్షన్‌లో 'లెజెండరీ' అని పేర్కొన్నారు.

రతన్ టాటా దత్తత..

రతన్ టాటా దత్తత..

రతన్ టాటా నావల్ టాటా కుమారుడు. టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జమ్‌సెట్‌జీ టాటా కుమారుడు రతన్‌ టాటాను దత్తత తీసుకున్నారు. 1961లో టాటా గ్రూప్ లో చేరిన రతన్ టాటా ఆ తర్వాత టాటా సన్స్ ఛైర్మన్‌గా అంచెలంచెలుగా ఎదిగారు. టాటా గ్రూప్ ఛైర్మన్‌గా JRD టాటా పదవీ విరమణ చేసిన తర్వాత.. 2012లో పదవి నుంచి వైదొలిగే వరకు ఆ పదవిలో కొనసాగారు. జాగ్వార్, ల్యాండ్ రోవర్, టెట్లీ, కోరస్ వంటి లగ్జరీ బ్రాండ్‌లను రతన్ టాటా హయాంలోనే కొనుగోలు జరిగింది. 2008లో దేశంలోని రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ తో సత్కరించబడ్డారు.

English summary

Ratan Tata: పాత మధుర జ్ఞాపకాన్ని పంచుకున్న రతన్ టాటా.. నెటిజన్లు ఫిదా.. చూడాల్సిందే బాస్ | Ratan Tata Shared his old memory in a pic with his brother Jimmy going viral

Ratan Tata Shared his old memory in a pic with his brother Jimmy going viral
Story first published: Tuesday, January 10, 2023, 15:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X