For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్, హైదరాబాద్ సహా 25 కేంద్రాలు

|

కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్ సదుపాయాలను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్నట్లు రాంకీ ఎన్విరో ఇంజనీర్స్ తెలిపింది. రాంకీ ఎన్విరో ఇంజినీర్స్ హైదరాబాద్‌కు చెందిన సంస్థ. మొదటి దశలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు, ఆదిత్యపూర్, చెన్నై నగరాలలో, ఆ తర్వాత మరో 25కి పైగా నగరాల్లో రీసైక్లింగ్ కేంద్రాలను నెలకొల్పనున్నట్లు పేర్కొంది. ఇందుకు ప్రయాణికుల సరకు రవాణా వాహనాల తయారీ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు వెల్లడించింది.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, విధానాలతో ఈ కేంద్రాలను నిర్వహించనున్నట్లు రాంకీ వెల్లడించింది. దేశంలో 2025 నాటికి కాలం చెల్లే వాహనాలు రెండు కోట్లకు పైగా ఉంటాయని అంచనా. ఈ వాహనాలను సరైన పద్ధతిలో రీసైకిల్ చేయకపోతే వాయు కాలుష్యం పెరుగుతుందని, కేంద్రం వెహికిల్ స్క్రాపేజీ పాలసీని ఆవిష్కరించించింది.

Ramky Enviro to set up nation wide network of end of life vehicle recycling facilities

వెహికిల్ రీసైక్లింగ్ కోసం రాంకీ పాసింజర్ వెహికిల్ సెగ్మెంట్, కమర్షియల్ వెహికిల్ సెగ్మెంట్ రంగంలోని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. పదిహేను నుండి 20 ఏళ్ళు నిండిన కాలం చెల్లిన వాహనాలను తగ్గించాలని, తద్వారా ఉద్గారాలు తగ్గించాలని కేంద్రం భావిస్తోంది.

English summary

కాలం చెల్లిన వాహనాల రీసైక్లింగ్, హైదరాబాద్ సహా 25 కేంద్రాలు | Ramky Enviro to set up nation wide network of end of life vehicle recycling facilities

Ramky Enviro Engineers Limited (REEL), a leading integrated player in the waste management and recycling space, has drawn up plans to set up a nation-wide network of End of Life Vehicle (ELV) recycling facilities.
Story first published: Tuesday, June 8, 2021, 14:09 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X