For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Big News: రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెబి షాక్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై నోటీసులు

|

ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి(SEBI) నోటీసులు ఇచ్చింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. Aptech లిమిటెడ్ షేర్‌లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణల మీద సెబీ నోటీసులు జారీ చేసింది. రాకేష్‌కు చెందిన Aptech లిమిటెడ్ షేర్లకు సంబంధించి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో షేర్ హోల్డర్లుగా ఉన్న రమేష్ ఎస్ దమానీ, డైరెక్టర్ మధు జయకుమార్ సహా ఇతర కుటుంబ సభ్యుల పాత్రపై కూడా సెబీ ఆరా తీస్తోంది.

దర్యాఫ్తుకు సహకరించాలని రాకేష్‌కు జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించిన ఆధారాలు ఏమిటి అనేది వెల్లడి కావాల్సి ఉంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణల మీద రాకేష్‌తో పాటు అతని భార్య రేఖ, సోదరుడు రాజేష్ కుమార్, అత్త సుశీలలు విచారణకు హాజరు కావాలని సెబి పేర్కొంది.

 Rakesh Jhunjhunwala under Sebi lens for insider trading

ఈ నెల 23న విచారణకు హాజరు కావాల్సిందిగా రాకేష్ సోదరి సుధకు అధికారులు సూచించారని తెలుస్తోంది. జనవరి 28న (నేడు) మరికొందరిని కూడా విచారణకు పిలిచారు. కాగా, ముంబైలోని సెబీ కార్యాలయంలో దర్యాఫ్తు అధికారి ఎదుట రాకేష్ హాజరైనట్లుగా తెలుస్తోంది. రెండు గంటల పాటు విచారించారు. ఆయన కుటుంబ సభ్యుల తరఫున హాజరైనట్లు లాయర్ తెలిపారు.

English summary

Big News: రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెబి షాక్.. ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలపై నోటీసులు | Rakesh Jhunjhunwala under Sebi lens for insider trading

Billionaire investor Rakesh Jhunjhunwala is being probed by Sebi for alleged insider trading in the shares of Aptech Ltd, an education firm owned by him and family, said two people familiar with the development.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X