For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ. లక్ష పెట్టుబడిని ఏడాదిలో రూ.33 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్.. మీరూ పెట్టుబడి పెట్టారా..

|

Multibagger Stock: పెన్నీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం చాలా రిస్క్‌తో కూడుకున్నది. కానీ అధిక రిస్క్ తీసుకునే ట్రేడర్లు తక్కువ ఫ్లోట్ స్టాక్‌లలో కూడా పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడుతుంటారు. అయితే జూదం ఆడకుండా సరైన సమాచారాన్ని సేకరించిన తర్వాత పెన్నీ స్టాక్‌లో పెట్టుబడి పెడతారు. స్టాక్‌లో పెట్టుబడి పెట్టడం అంటే సదరు కంపెనీకి చెందిన వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం లాంటిది.

కాబట్టి.. వ్యాపారం పరిమాణంతో సంబంధం లేకుండా, ఇతర ప్యారామీటర్స్ ను కూడా పరిగణలోకి తీసుకుని పెట్టుబడి నిర్ణయాన్ని తీసుకోవాలి. కంపెనీ బ్యాలెన్స్ షీట్ సమాచారం సంతృప్తికరంగా ఉంటే.. మంచి పెన్నీ స్టాక్ లో పెట్టుబడి పెట్టవచ్చు. సరైన పెన్సీ స్టాక్‌లో పెట్టుబడి స్వల్పకాలంలో భారీ రాబడిని అందిస్తాయి.

3200 శాతం రాబడినిచ్చిన పెన్నీ స్టాక్

3200 శాతం రాబడినిచ్చిన పెన్నీ స్టాక్

మంచి పెన్నీ స్టాక్ దాని వాటాదారులకు ఎలా తిరిగి మంచి రాబడిని ఇవ్వగలదు అనేదానికి.. రజనీష్ వెల్నెస్ లిమిటెడ్ షేర్లు(Rajnish Wellness Ltd) అద్భుతమైన ఉదాహరణ. ఈ పెన్నీ స్టాక్ ఒక సంవత్సరంలో మల్టీబ్యాగర్‌గా మారింది. ఒక సంవత్సర కాలంలో ఈ స్టాక్ ధర రూ.5.56 నుంచి రూ.185కి చేరుకుంది. ఇన్వెస్టర్లకు ఈ స్టాక్ దాదాపు 3200 శాతం కంటే ఎక్కువ రాబడిని అందించింది.

రజనీష్ వెల్నెస్ షేర్ ధర హిస్టరీ

రజనీష్ వెల్నెస్ షేర్ ధర హిస్టరీ

BSEలో షేర్ జీవితకాల గరిష్ఠ స్థాయి అయిన రూ.203కి చేరుకున్న తర్వాత.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్ కన్సాలిడేషన్ దశలోనే ఉంది. గత ఒక నెలలో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ దాదాపు 2 శాతం పడిపోయింది. BSE-లిస్టెడ్ స్టాక్ రూ.20.45 నుంచి రూ.185 స్థాయిలకు పెరిగింది. షేర్ ఈ సంవత్సరం దాదాపు 800 శాతం మేర పెరిగింది.

గత 6 నెలల్లో.. రజనీష్ వెల్‌నెస్ షేరు ధర దాదాపు రూ.46 నుంచి రూ.185 వరకు పెరిగింది. ఈ ఆరు నెలల కాలంలో స్టాక్ దాని వాటాదారులకు దాదాపు 300 శాతం రాబడిని అందజేస్తుంది. అదేవిధంగా గత ఒక నెలలో ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ రూ.5.56 నుంచి రూ.185 స్థాయిలకు పెరిగింది. ఈ కాలంలో 3200 శాతం కంటే ఎక్కువ పెరిగింది.

ఇన్వెస్టర్లకు రిటర్న్స్

ఇన్వెస్టర్లకు రిటర్న్స్

రజనీష్ వెల్‌నెస్ షేర్ ధర చరిత్రను గమనిస్తే.. ఒక నెల క్రితం ఈ స్టాక్‌లో లక్ష ఇన్వెస్ట్ చేసిన పెట్టుబడిదారునికి దాని విలువ రూ. 98,000కి చేరి ఉండేది. అయితే YTD ప్రాతిపదికన చూస్తే లక్ష విలువ రూ.9 లక్షలకు చేరుకుంది. పెట్టుబడిదారుడు 6 నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌లో లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుతం దాని విలువ రూ.4 లక్షలకు మారి ఉండేది. సంవత్సరం క్రితం ఈ పెన్నీ స్టాక్‌లో లక్ష పెట్టుబడి పెట్టి ఉండే.. రూ.33 లక్షల రాబడి వచ్చి ఉండేది.

కంపెనీ మార్కెట్ క్యాప్ ఎంతంటే..

కంపెనీ మార్కెట్ క్యాప్ ఎంతంటే..

మల్టీబ్యాగర్ స్టాక్ ప్రస్తుత మార్కెట్ క్యాప్ రూ.193 కోట్లుగా ఉంది. స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ ట్రేడ్ వాల్యూమ్ దాదాపు 61,500గా ఉంది. రజనీష్ వెల్‌నెస్ షేరు ధర BSEలో 52 వారాల గరిష్ఠం ధర రూ. 203 ఉండగా.. దాని 52 వారాల కనిష్ఠం ధర రూ.4.44గా ఉంది. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌ ఒక్కో షేర్ బుక్ వ్యాల్యూ దాదాపు రూ. 20.66గా ఉంది.

English summary

రూ. లక్ష పెట్టుబడిని ఏడాదిలో రూ.33 లక్షలుగా మార్చిన మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్.. మీరూ పెట్టుబడి పెట్టారా.. | Rajnish Wellness penny stock gave multibagger returns to its investors in just one year

This Penny stock in wellness business gave Multibagger returns to is Investors In a year
Story first published: Wednesday, June 8, 2022, 8:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X