ముంబై: రైల్ టెల్ ఐపీవో 42.39 శాతం సబ్‌స్క్రిప్షన్ అయింది. రిటైల్ కేటగిరీలో 16.78 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. క్యూఐబీలో 65.14 శాతం, ఎన్ఐై కేటగిరీలో 73.25 శాతం నమోదయింది. రైల్ టెల్ కార్పోరేషన్ ఐపీవో షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో ఫిబ్రవరి 26వ తేదీన లిస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రైల్ టెల్ ఐపీవోలో వాటా కేటాయింపు బ్రోకరేజెస్ ప్రకారం నేడు ఖరారయ్యే అవకాశముంది.
రైల్ టెల్ ఐపీఓకు ధరఖాస్తుదారుల కేటాయింపుస్థితిని కెఫిన్ టెక్నాలజీస్ వెబ్‌సైట్‌లో చెక్ చేయవచ్చు. ఇది షేర్ల వాటా కేటాయింపులను, రీఫండ్స్‌ను నిర్వహిస్తుంది. ఈ వివరాలు బిఎస్ఈ వెబ్‌సైట్‌లో ఉంటాయి. షేర్ల జాబితా ఫిబ్రవరి 26న ఉంటుంది.

16 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్
రైల్ టెల్ ఐపీవో సబ్‌స్క్రిప్షన్ ఫిబ్రవరి 16వ తేదీన ప్రారంభమై 18వ తేదీన ముగిసింది. ధర రూ.93-94 మధ్య ఉంది. ప్రభుత్వం 27.16 శాతం వాటాను విక్రయిస్తోంది. రైల్ టెల్ రూ.819 కోట్ల ఐపీవో ఫిబ్రవరి 16-18 మధ్య ఓపెన్ చేశారు. ఈ ఆఫర్‌లో ఉన్న షేర్లు 6,11,95,923. ఈ ఆఫర్‌కు 2,59,42,43,370 షేర్లకు బిడ్స్ వచ్చాయి. రిటైల్ వ్యక్తిగత పెట్టుబడిదారుల విభాగం నుండి 16 రెట్లు, అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల నుండి 65 రెట్లు, సంస్థేతర పెట్టుబడిదారుల నుండి 73 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. ఆఫర్ నిర్వాహకులు ఐసీఐసీఐ సెక్యూరిటీస్, ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ అండ్ సెక్యూరిటీస్ లిమిటెడ్, ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ పని చేశాయి.

యాంకర్ ద్వారా రూ.244 కోట్లు సమీకరణ
ఐపీవోకు ముందు రైల్ టెల్ యాంకర్ పెట్టుబడిదారుల నుండి రూ.244 కోట్లు సమీకరించింది. ఈ ఐపీవో ఇష్యూకు పలు బ్రోకరేజీ సంస్థలు సిఫార్స్ చేశాయి. రైల్ టెల్ తన ఆదాయంలో 66 శాతం టెలికం విభాగం నుండి పొందుతుంది. మిగిలిన భాగం రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల ద్వారా వస్తోంది. రైల్ టెల్ సమర్థవంతంగా పని చేస్తే భారత్‌లో 5జీ వృద్ధి నుండి ఫైబరైజేషన్ అవసరాల కోణం నుండి ప్రయోజనం పొందవచ్చు. రైల్ టెల్ రుణరహిత సంస్థ. స్థిరమైన డివిడెండ్స్ చెల్లిస్తుంది.

అలాట్‌మెంట్ స్టేటస్ ఇలా తెలుసుకోవచ్చు..
- ఈ బీఎస్ఈ వెబ్ సైట్‌లోకి వెళ్లి అలాట్‌మెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.
https://www.bseindia.com/investors/appli_check.aspx
- వెబ్ సైట్ ఓపెన్ అయ్యాక ఈక్విటీ పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇష్యూ నేమ్ రైల్ టెల్ పైన క్లిక్ చేయాలి.
- అప్లికేషన్ నెంబర్, పాన్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత స్టేటస్ చెక్ చేయడానికి ఎంటర్ కొట్టాలి.
కెఫిన్‌టెక్‌లోను తెలుసుకోవచ్చు. వెబ్ సైట్‌లోకి వెళ్లాలి. ఐపీవో పైన క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్ లేదా డీపీ ఐడీ/క్లయింట్ ఐటీ/పాన్ నెంబర్ ఎంటర్ చేయాలి.
అప్లికేషన్ నెంబర్ ఉపయోగిస్తే అప్లికేషన్ టైప్ చూసుకోవాలి.
డీపీ ఐడీ/క్లయింట్ ఐడీ అయితే ఎన్ఎస్‌డీఎల్ లేదా సీడీఎస్ఎల్ డిపాజిటరినీ ఎంచుకొని, ఐడీని ఎంటర్ చేయాలి.
కాప్చాను టైప్ చేసి, సబ్‌మిట్ చేయాలి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications