For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Mutual Fund: రూ. 3 లక్షల 60 వేలను రూ.7.5 లక్షలు చేసిన ఫండ్.. అదీ 3 ఏళ్లలోనే..

|

ఈ మధ్య స్టాక్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టే వారు పెరిగిపోయారు. అయితే చాలా మంది కనీస అవగాహన లేకుండా పెట్టుబడి నష్టపోయారు. మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం స్టాక్ మార్కెట్ ను నిత్యం ట్రాక్ చేస్తూ, స్టాక్స్ పై అవగాహన ఉన్నవారే పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. స్టాక్ మార్కెట్ ట్రాక్ చేయకుండా, అవగాహన లేని వారు మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం మంచిదని చెబుతున్నారు.

ఇండెక్స్ ఫండ్

ఇండెక్స్ ఫండ్

అయితే ఎలాంటి మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టాలో తెలియని వారు కూడా ఉన్నారు. అయితే మొదటిసారిగా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టేవారు ఇండెక్స్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ఆ తర్వాత మిగతా ఫండ్లలో పెట్టుబడి పెట్టాలని వివరిస్తున్నారు. ఫండ్ గత 5 సంవత్సరాల్లో ఇచ్చిన రిటర్స్న్ ఆధారంగా ఫండ్ ఎంచుకోవాలని పేర్కొంటున్నారు.

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్-గ్రోత్

క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్-గ్రోత్

అలాగే ఫండ్ సైజ్, ఎక్స్ పెన్స్ రేషియేను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లలో SIPలో పెట్టుబడి పెడితే మంచిదని చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో క్వాంట్ స్మాల్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్-గ్రోత్ మంచి రాబడి ఇచ్చింది. ఈ ఫండ్ గత సంవత్సరం దాని పెట్టుబడిదారులకు 12.24% రాబడిని ఇచ్చింది. సంవత్సరంలో కొన్ని నెలలు మినహా ఈ ఫండ్ వార్షిక సగటు దాదాపు 15.48%గా ఉంది.

రూ. 14 లక్షలు

రూ. 14 లక్షలు

ఒక వ్యక్తి 5 సంవత్సరాల క్రితం ఈ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో నెలకు రూ. 10,000 సిప్‌లో పెట్టుబడి పెడితే ఇప్పుడు అతను పెట్టుబడి పెట్టిన మొత్తం రూ. 14 లక్షలు అయింది. అదే సమయంలో, రూ. 10,000 3 సంవత్సరాల SIPలో పెట్టుబడి పెడితే ఇప్పుడురూ. 7.5 లక్షలు అయింది. ఈ ఫండ్ గత రెండేళ్లలో 36.68% రాబడిని ఇచ్చింది.

Note: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే ఇచ్చాం. మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి రిస్క్ తో కూడుకున్నది. పెట్టుబడి పెట్టే ముందు నిపుణులను సంప్రదించగలరు.

English summary

Mutual Fund: రూ. 3 లక్షల 60 వేలను రూ.7.5 లక్షలు చేసిన ఫండ్.. అదీ 3 ఏళ్లలోనే.. | Quant Small Cap Fund Direct Plan-Growth Fund has returned 36 percent in the last two years

The Quant Small Cap Fund Direct Plan-Growth Fund has given good returns to investors, registering a return of 36 percent in the last two years.
Story first published: Saturday, August 27, 2022, 12:53 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X