For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జియో ప్లాట్‌ఫాంలో అమెరికా టెక్ దిగ్గజం రూ.730 కోట్ల భారీ పెట్టుబడి

|

ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్‌లోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. అమెరికా 5జీ టెక్నాలజీ దిగ్గజం క్వాల్‌కామ్... జియోలో రూ.730 కోట్లతో 0.15 శాతం వాటాను తీసుకుంది. రిలయన్స్ జియోకు 12 వారాల్లో ఇది 13వ భారీ పెట్టుబడి. ఈ కంపెనీలు జియో ప్లాట్‌ఫామ్స్‌లో రూ.118,318.45 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి.

జియో, పెట్టుబడులకు సంబంధించి మరిన్ని వార్తలు

తక్కువ కాలంలోనే

తక్కువ కాలంలోనే

ప్రపంచంలో మరే కంపెనీ కూడా ఇంత తక్కువ కాలంలో ఇంత భారీ పెట్టుబడులు సమీకరించలేదు. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతున్నాయి. కంపెనీలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌లో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఏప్రిల్ 22వ తేదీన ఫేస్‌బుక్ రూ.43,574 కోట్లతో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. అప్పటి నుండి పెట్టుడుల వరద పారుతోంది.

ఇదీ క్వాల్‌కమ్

ఇదీ క్వాల్‌కమ్

క్వాల్‌కామ్ ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలోని శాన్‌డియాగో నగరం ఉంది. వైర్ లెస్ టెక్నాలజీ కంపెనీ. 3G, 4G, 5G వైర్‌లెస్‌లో ఈ కంపెనీకి ప్రత్యేకతలు ఉన్నాయి. క్వాల్‌కామ్ టెక్నాలజీని, ఉత్పత్తులను ప్రధానంగా మొబైల్ డివైజెస్, ఇతర వైర్‌లెస్ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ సిస్టం ఆన్ ఏ చిప్ (SoC)ని ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఉపయోగిస్తాయి. ఆటోమోటివ్, కంప్యూటీంగ్, ఐవోటీలోను ఈ కంపెనీ టెక్నాలజీని, ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇది పలు పేటెంట్ హక్కులు కలిగి ఉంది. రూ.4.91 లక్షల కోట్ల ఈక్విటీ, రూ.4.16 లక్షల కోట్ల ఎంటర్‌ప్రైజెస్ వ్యాల్యూ ఆధారంగా క్వాల్‌కామ్ వెంచర్స్ ఈ పెట్టుబడి పెడుతోంది.

13 వరుస పెట్టుబడులు

13 వరుస పెట్టుబడులు

- ఏప్రిల్ 22 - ఫేస్‌బుక్ - రూ.43,573.62 కోట్లు - 9.99 శాతం వాటా

- మే 3 - సిల్వర్ లేక్ పార్ట్‌నర్స్ - రూ.5,655.75 కోట్లు - 1.15 శాతం వాటా

- మే 8 - విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

- మే 17 - జనరల్ అట్లాంటిక్ - రూ.6,598.38 కోట్లు - 1.34 శాతం వాటా

- మే 22 - కేకేఆర్ - రూ.11,367.00 కోట్లు - 2.32 శాతం వాటా

- జూన్ 5 - ముబాదాల - రూ.9,093.60 కోట్లు - 1.85 శాతం వాటా

- జూన్ 5 - సిల్వర్ లేక్ (రెండోసారి) - రూ.4,546.80 కోట్లు - 0.93 శాతం వాటా

- జూన్ 7 - ADIA - రూ.5,683.50 కోట్లు - 1.16 శాతం వాటా

- జూన్ 13 - TPG - రూ.4,546.8 కోట్లు - 0.93 శాతం వాటా

- జన్ 13 - ఎల్-కేటర్టన్ - రూ.1,894.50 కోట్లు - 0.39 శాతం వాటా

- జూన్ 18 - PIF - రూ.11,367 కోట్లు - 2.32 శాతం వాటా

- జూలై 3 - ఇంటెల్ - రూ.1,894.5 కోట్లు - 0.39 శాతం వాటా

- జూలై 12 - క్వాల్‌కామ్ - రూ.730 కోట్లు - 015 శాతం వాటా

English summary

జియో ప్లాట్‌ఫాంలో అమెరికా టెక్ దిగ్గజం రూ.730 కోట్ల భారీ పెట్టుబడి | Qualcomm Invests Rs 730 crores in Reliance Jio

In an unprecedented thirteenth consecutive deal for Reliance Industries Limited, US-based Qualcomm Inc will invest Rs 730 crore in Jio Platforms for a 0.15 percent stake, joining other big-name investors in the digital unit of Reliance.
Story first published: Monday, July 13, 2020, 7:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X