For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఖతార్ భలే స్కీం, ఇంటి కొనుగోలుదారులకు 'ఫర్ సేల్' ఆఫర్

|

చమురుపై ప్రధానంగా ఆధారపడిన ఖతార్ ఇప్పుడు ప్రాపర్టీ మార్కెట్ పైన దృష్టి సారించింది. విదేశీయులకు ప్రాపర్టీ విక్రయించడం ద్వారా ఆహ్వానం పలుకుతోంది. ఈ పథకాన్ని సెప్టెంబర్ నెలలోనే ప్రకటించినప్పటికీ కొన్ని సంస్కరణలతో మార్పులు చేసి తీసుకు వచ్చింది. ఖతార్ ప్రధానంగా ఇంధనంపై ఆధారపడింది. దీనిపై ఆధారపడటాన్ని తగ్గించి నిధులు సమకూర్చుకోవడానికి, 2022 ప్రపంచ కప్‌కు ముందు విదేశీ మూలధనాన్ని సమకూర్చుకోవడం కోసం దీనిని రూపొందించింది.

అర్హత కలిగిన కొనుగోలుదారులకు సముద్రపు ఒడ్డున ఉన్న ఆకర్షణీయ పెరల్ ఐలాండ్ లేదా కొత్తగా ఏర్పాటు చేసిన లుజైల్ సిటీ ప్రాజెక్టులను కేటాయించింది. అర్హత కలిగిన మాల్స్‌లోని రిటైల్ యూనిట్లు కూడా కొనుగోలుదారులకు రెసిడెన్సీ అర్హతను కలిగిస్తాయి.

Gas Refill: ఈ నెంబర్‌తో... వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయండి!Gas Refill: ఈ నెంబర్‌తో... వాట్సాప్ ద్వారా గ్యాస్ బుక్ చేయండి!

ఖతార్ అదిరిపోయే ఆఫర్

ఖతార్ అదిరిపోయే ఆఫర్

ఇక్కడ వరల్డ్ కప్ స్టేడియాన్ని నిర్మించింది. సీసైడ్ టవర్లలో బ్లాకులతో పాటు రిటైల్ యూనిట్లను సైతం కొనుగోలుదారులకు ఆఫర్ చేస్తోంది. 2016 నుండి ప్రాపర్టీ ధరలు మూడోవంతు క్షీణించాయి. సరఫరాకు తగిన డిమాండ్ లేకపోవడంతో రెసిడెన్షియల్ యూనిట్లు ఖాళీగా ఉన్నాయి. ఈ మేరకు రెసిడెన్షియల్ ప్రాపర్టీ వాలుస్ట్రాట్ ప్రైస్ ఇండెక్స్ వెల్లడించింది. ఇదివరకు ఖతార్ రెసిడెన్సీ కోసం బిజినెస్ లేదా స్పాన్సర్‌షిప్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 200,000 డాలర్ల ప్రాపర్టీని కొనుగోలు చేస్తే తాత్కాలిక యాజమాన్య హక్కులు పొందవచ్చు. 1 మిలియన్ డాలర్ల (పది లక్షల డాలర్లు)తో ప్రాపర్టీని కొనుగోలు చేస్తే శాశ్వత నివాస ప్రయోజనంతో పాటు ఉచిత స్కూల్, హెల్త్‌కేర్ వంటి అదనపు ప్రయోజనాలు ఉన్నాయి.

ఖతార్‌లో ఇంటి కల

ఖతార్‌లో ఇంటి కల

తాను పదిహేనేళ్లుగా ఖతార్‌లో నివసిస్తున్నానని, కానీ అనధికార మార్కెట్ వల్ల ఇంటిని సమకూర్చుకోలేకపోయానని, ఇప్పుడు తన ఇంటి కల నెరవేరేలా కనిపిస్తోందని కెన్యాకు చెందిన మార్కెటింగ్ డైరెక్టర్ టీనా అన్నారు. తనకు ఖతార్‌లో సొంతిల్లు ఉందన చెప్పుకోవడానికి ఇది దోహదపడుతుందన్నారు. ఇప్పుడు తాను మరింత కంఫోర్టబుల్‌గా ఉండగలనని పేర్కొన్నారు. నైరోబీ నుండి ఖతార్‌కు తన వృద్ధ తల్లిదండ్రులు సహా కుటుంబాన్ని తీసుకు వచ్చేందుకు ఉపయోగపడుతుందన్నారు. కెన్యాతో పోలిస్తే సురక్షితమన్నారు.

దుబాయ్‌లోను..

దుబాయ్‌లోను..

విదేశీయులు ఖతార్‌లోని 25 ప్రాంతాల్లో, ముఖ్యంగా రాజధాని దోహా ప్రాంతాల్లో గృహాలను సొంతం చేసుకోవచ్చు. 99 ఏళ్ల కాలానికి లీజ్‌ను ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఖతార్‌లోని ఇలాంటి స్కీంలు ఇతర గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. దుబాయ్ కూడా 2.7 మిలియన్ డాలర్ల పెట్టుబడులతో 10 సంవత్సరాల రెసిడెన్సీ వీసాను అందిస్తోంది. 2.7 మిలియన్ డాలర్లలో 40 శాతం ప్రాపర్టీ రూపంలో ఉండాలి.

English summary

ఖతార్ భలే స్కీం, ఇంటి కొనుగోలుదారులకు 'ఫర్ సేల్' ఆఫర్ | Qatar puts up for sale sign with new property visas

Gas rich Qatar has flung open its property market to foreigners, with a scheme giving those purchasing homes or stores the right to call the Gulf nation home.
Story first published: Wednesday, November 11, 2020, 14:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X