For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంత త్వరగానా.. జీడీపీ గణాంకాలు ఆశ్చర్యకరమే: ఆర్థికవేత్తలు ఏమన్నారంటే

|

భారత జీడీపీ వృద్ధిరేటు 2020-21 ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.5 శాతంగా నమోదయింది. ప్రధానంగా తయారీ రంగం భారీగా పుంజుకుంది. ఈ నేపథ్యంలో జీడీపీ గణాంకాలు మొదటి క్వార్టర్‌లో మైనస్ 23.9 శాతంగా ఉండగా, రెండో త్రైమాసికంలో క్షీణత అంచనాల కంటే కాస్త తగ్గి ఆశాజనకంగా ఉంది. అయితే జీడీపీ గణాంకాలు ఆశ్యర్యకరంగా ఉన్నాయని, తయారీ రంగం అంత త్వరగా ఎలా పుంజుకుందని ఎస్బీఐ పరిశోధనపత్రంలో ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు.

భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.. కానీ ఎకనమిక్ పెయిన్ మరింత కాలం..భారత ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోంది.. కానీ ఎకనమిక్ పెయిన్ మరింత కాలం..

ఆశ్చర్యం కలిగించింది

ఆశ్చర్యం కలిగించింది

తయరీ రంగం ఆశ్చర్యకరరీతిలో పుంజుకొని, రెండో త్రైమాసికంలో జీడీపీని మైనస్ 7.5 శాతానికి పరిమితం చేసిందని, కానీ కార్పోరేట్లు, వ్యాపారవేత్తలు తమ ఉద్యోగుల వ్యయాలను భారీగా తగ్గించుకోవడం వల్లే సాధ్యమై ఉండవచ్చునని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. లేదంటే అంతకంటే ఎక్కువ క్షీణిస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేసినట్లు ఎస్బీఐ ఎకోరాప్ గ్రూప్ చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ సౌమ్యకాంతిఘోష్ అన్నారు. లాక్ డౌన్ కారణంగా తొలి త్రైమాసికంలో భారీగా క్షీణించిన తయారీ రెండో క్వార్టర్ సమయానికి సానుకూలంగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు.

తయారు రంగం వేగంగా ఎలా కోలుకుందో..

తయారు రంగం వేగంగా ఎలా కోలుకుందో..

తయారీ రంగం అంత వేగంగా ఎలా కోలుకుందో తెలియడం లేదని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 3.4 శాతం నమోదయింది. ట్రేడ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా మైనస్ 15.6 శాతం ప్రతికూలత నమోదు చేసింది. వాణిజ్యం, హోటల్స్, రవాణా, కమ్యూనికేషన్, కమ్యూనికేషన్, సేవా రంగాలు ప్రతికూలతనే నమోదు చేశాయి. Q2లో తయారీ సానుకూల వృద్ధి చాలా ఆశ్చర్యకరమని, Q1లో లాక్ డౌన్ వల్ల భారీగా ప్రభావితమైందని, అలాంటి తయారీ రంగం అంత వేగంగా ఎలా కోలుకుందోనని అంటున్నారు. ఐఐపీ మ్యానుఫ్యాక్చరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ జీవీఏ గ్రోత్ పరస్పర సంబంధం కలిగి ఉన్నాయని తెలిపారు.

ప్రతికూల ప్రభావం...

ప్రతికూల ప్రభావం...

రూ.500 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన కంపెనీలు భారీగా వ్యయాలు తగ్గించుకున్నాయని, ఉద్యోగుల వ్యయాల్లో పది శాతం నుండి 12 శాతం తగ్గించాయని, దీంతో కార్పోరేట్ గణాంకాలు బలంగా నమోదయ్యాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అందుకే తయారీ గణాంకాలు రాణించి ఉండవచ్చునని తెలిపారు. భవిష్యత్తులో వినియోగం తగ్గినా నిల్వలు పెరిగినా తయారీ రంగంపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చునని తెలిపారు.

English summary

అంత త్వరగానా.. జీడీపీ గణాంకాలు ఆశ్చర్యకరమే: ఆర్థికవేత్తలు ఏమన్నారంటే | Q2 GDP growth shows surprising resilience

Contracting for the second consecutive quarter, India's GDP fell 7.5 per cent during September quarter, albeit much slower than 23.9 per cent decline registered in June quarter, signalling a rebound.
Story first published: Sunday, November 29, 2020, 7:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X