For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుంజుకుంటున్న ఎకానమీ, Q2లో 7.5 శాతం క్షీణత: టెక్నికల్‌గా ఆర్థిక సంక్షోభంలో భారత్..

|

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో భారత ఆర్థిక వ్యవస్థ దారుణంగా క్షీణించింది. అయితే జూన్ త్రైమాసికంలో వృద్ధి రేటును మైనస్ 23.9 శాతం నమోదు చేసిన తర్వాత సెప్టెంబర్ క్వార్టర్‌లో మైనస్ 10 శాతం అంతకంటే క్షీణత నమోదు చేయవచ్చునని పలు సర్వేలు అంచనా వేశాయి. అయితే జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 7.5 శాతంగా నమోదయింది. ఈ మేరకు కేంద్రం ప్రకటించింది. మొదటి త్రైమాసికంతో పోలిస్తే రెండో క్వార్టర్‌లో ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడం ప్రారంభమైందని, ఇది ఆశాజనకమని తెలిపింది. ఒక నిర్దిష్ట వ్యవధిలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం వ్యాల్యూ స్థూల దేశీయోత్పత్తి లేదా జీడీపీని సూచిస్తుంది.

గత ఏడాది వృద్ధి.. ఇప్పుడు ప్రతికూలత

గత ఏడాది వృద్ధి.. ఇప్పుడు ప్రతికూలత

వ్యవసాయం, అటవీ-ఫిషరీస్, తయారీ రంగం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా రంగాలతో పాటు నిత్యావసర సేవలు పుంజుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 202-21 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో అన్ని రంగాలు కాస్త పుంజుకోవడంతో వృద్ధిరేటు 7.5 శాతం ప్రతికూలత నమోదు చేసింది. 2020-21 రెండో త్రైమాసికంలో స్థిర కరెన్సీ(2011-12) వద్ద జీడీపీ రూ.33.14 లక్షల కోట్లుగా అంచనా వేయబడిందని, 2019-20 రెండో ఆర్థిక సంవత్సరంలో ఇది రూ.35.84 లక్షల కోట్లుగా ఉందని గణాంకాలు చెబుతున్నాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే మైనస్ 7.5 శాతంగా ఉంది. గత ఏడాది రెండో త్రైమాసికంలో వృద్ధి రేటు 4.4 శాతంగా ఉంది.

టెక్నికల్‌గా ఆర్థిక సంక్షోభంలోకి..

టెక్నికల్‌గా ఆర్థిక సంక్షోభంలోకి..

రెండో త్రైమాసికంలో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు 3.4 శాతం నమోదయింది. ట్రేడ్ అండ్ సర్వీసెస్ సెక్టార్ ఊహించిన దాని కంటే చాలా ఎక్కువగా మైనస్ 15.6 శాతం ప్రతికూలత నమోదు చేసింది. కాగా, రెండు వరుస త్రైమాసికాల్లో భారత జీడీపీ ప్రతికూలతను నమోదు చేసింది. దీంతో టెక్నికల్‌గా సంక్షోభంలోకి వెళ్లినట్లు. అయితే ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటుండటం గమనార్హం. భారత్ 1997-98 ఆర్థిక సంవత్సరం నుండి త్రైమాసిక జీడీపీని విడుదల చేస్తోంది. మొదటిసారి టెక్నికల్ రిసెషన్‌లోక వెళ్లింది.

అంచనాలకు మించి...

అంచనాలకు మించి...

భారత వృద్ధి రేటు రెండో త్రైమాసికంలో వివిధ సంస్థలు అంచనా వేసిన దాని కంటే కాస్త ఆశాజనకంగా ఉన్నాయి. జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటుపై ఆర్బీఐ సహా వివిధ సంస్థలు అంచనా వేశాయి. రెండో త్రైమాసికంలో మైనస్ 8.6 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఇండియా రేటింగ్స్ (మైనస్ 11.9 శాతం), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (మైనస్ 10.7 శాతం), నోమురా (మైనస్ 10.4 శాతం), కేర్ రేటింగ్స్ (మైనస్ 9.9 శాతం), ఇక్రా లిమిటెడ్ (మైనస్ 9.5 శాతం), కొటక్ మహీంద్ర బ్యాంకు (మైనస్ 9.1 శాతం), డచ్ బ్యాంకు (మైనస్ 9 శాతం), బార్క్‌లేస్ (మైనస్ 8.5 శాతం), బోఫా మెరిల్ లించ్ (మైనస్ 8.2 శాతం), బ్యాంక్ ఆఫ్ బరోడా (మైనస్ 8 శాతం), ఐసీఐసీఐ బ్యాంకు (మైనస్ 8 శాతం), మోతీలాల్ ఓస్వాల్ (మైనస్ 6 శాతం) అంచనా వేశాయి.

English summary

పుంజుకుంటున్న ఎకానమీ, Q2లో 7.5 శాతం క్షీణత: టెక్నికల్‌గా ఆర్థిక సంక్షోభంలో భారత్.. | Q2 GDP Data: GDP contraction slows to -7.5 percent in Q2, India officially in recession

India GDP, manufacturing PMI, India india gdp growth rate 2020, india gdp 2020, india gdp growth rate, Q2 GDP data, Q2 report card, GDP numbers today, Q2 GDP contraction, GST e-way bills, gdp of india, gdp of india 2020, gdp estimates 2020, gdp estimation in india, India GDP forecast, Q2 GDP Estimatation, Q2 GDP Estimatation, Q2 data due on November 27, Covid-19 pandemic, Recession, growth
Story first published: Friday, November 27, 2020, 19:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X