For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఓ వైపు ఆర్థిక మందగమనం, మరోవైపు మార్కెట్ పరుగు, ఈ పజిల్ ఏమిటో!

|

ఓ వైపు ప్రపంచవ్యాప్తంగా, అలాగే దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు మాత్రం పరుగులు పెడుతున్నాయి. దీనిపై ఆర్థికవేత్త, ప్రభుత్వ మాజీ ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ గురువారం స్పందించారు. ఓ వైపు మందగమనం ఉంటే మరోవైపు స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని, ఇదో పజిల్ అని ఆయన కన్ఫ్యూజన్ వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఆర్థిక వ్యవస్థ ఎందుకు క్షీణిస్తుందో, అలాగే స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుందో తనకు కేంద్ర ప్రభుత్వం చెబుతారని ఆశిస్తున్నట్లు తెలిపారు. నా కోసం ఈ పజిల్‌ను సాల్వ్ చేస్తే నేను అమెరికా నుంచి వస్తానని చెప్పారు. దీనిపై పరిశోధన జరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.

భూమి రిజిస్ట్రేషన్‌కు త్వరపడండి!: మందగమనం ఎఫెక్ట్, తెలంగాణలో భూముల విలువ పెంపు?భూమి రిజిస్ట్రేషన్‌కు త్వరపడండి!: మందగమనం ఎఫెక్ట్, తెలంగాణలో భూముల విలువ పెంపు?

 Puzzled why stock market is buoyant amidst slowdown: Arvind Subramanian

ఈ సంవత్సరం ఆర్థిక శాస్త్రానికి నోబెల్ బహుమతి వచ్చిందని గుర్తు చేస్తూ, కేవలం ఆర్థిక శాస్త్రం, ఫైనాన్స్, మార్కెటింగ్ లాంటి వాటికి మాతారమే ఈ ప్రాజెక్టు పరిమితం కాకుండా ఎకనామిక్స్‌లోని కొన్ని పరిస్థితులకు మానవుల స్పందన ఎలా ఉంటుందోననే అసాధారణమైన విషయాలపై దృష్టి సారించాలన్నారు.

గత కొద్ది రోజులుగా సెన్సెక్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నప్పటికీ రికార్డ్ హైకి చేరుకుంది. తాజాగా శుక్రవారం సెన్సెక్స్ 41,702 పాయింట్ల వద్ద, నిఫ్టీ 12,266 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇవి రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. కానీ ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమన పరిస్థితులు నెలకొన్నాయి.

English summary

ఓ వైపు ఆర్థిక మందగమనం, మరోవైపు మార్కెట్ పరుగు, ఈ పజిల్ ఏమిటో! | Puzzled why stock market is buoyant amidst slowdown: Arvind Subramanian

Expressing his confusion over a buoyant stock market amidst economic slowdown, renowned economist and former chief economic advisor (CEA) for government, Arvind Subramanian called for research in the area.
Story first published: Friday, December 20, 2019, 14:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X