Punjab National Bank: రైతులకు శుభవార్త.. రూ.50,000 లోన్ ఇస్తున్న బ్యాంక్.. సులువుగా పొందండిలా..
Punjab National Bank: పంజాబ్ నేషనల్ బ్యాంక్ రైతుల కోసం ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోంది. వ్యవసాయానికి కాకుండా వ్యక్తిగత అవసరాలను తీర్చుకోవడానికి ఈ డబ్బును ఉపయోగించవచ్చు. అసలు ఏ పథకం కింద బ్యాంక్ దీనిని అందిస్తోంది.. దీనిని పొందటానికి ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకోండి.
|
రైతుల ఖాతాలో జమ..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ PNB కిసాన్ వినియోగదారులకు తక్షణ రుణ పథకం సౌకర్యాన్ని అందిస్తోంది. దీని కింద డబ్బు రైతుల ఖాతాలో జమ చేయబడుతుంది. ప్రతి రైతు అవసరాలను తీర్చేందుకు బ్యాంక్ కిసాన్ తత్కాల్ కర్జ్ యోజనను ప్రవేశపెట్టినట్లు పంజాబ్ నేషనల్ బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. దీని కింద రైతులు గరిష్ఠంగా 50 వేల రూపాయలు లోన్ రూపంలో పొందవచ్చు. దీనికోసం ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బ్యాంక్ అడిగే కొన్ని బేసిక్ పత్రాలు అందిస్తే సరిపోతుంది.

ఏ అవసరం కోసమైనా లోన్ తీసుకోవచ్చు..
పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ పథకం కింద మీకు వ్యవసాయం లేదా గృహ అవసరాల కోసం డబ్బును తీసుకోవచ్చు. కిసాన్ తత్కాల్ లోన్ యోజన ప్రతి సహాయానికి సిద్ధంగా ఉంది. దీనిని వ్యవసాయ రంగంలో పనిచేసే రైతులు లేదా వ్యవసాయ భూమికి కౌలుదారు అయి ఉండాలి. ఇప్పటికే కిసాన్ క్రెడిట్ కార్డ్ (KCC) కలిగి ఉన్న రైతులు లేదా రైతుల సమూహాలకు మాత్రమే పథకం ప్రయోజనం ఇవ్వబడుతుంది.
అలాగే దీని కోసం వారు గత రెండేళ్లుగా ఖచ్చితమైన బ్యాంక్ రికార్డులను కలిగి ఉండాలని బ్యాంక్ తెలిపింది. దీనిని పొందటానికి ఎలాంటి సర్వీస్ ఛార్జీలు ఉండవని, తిరిగి చెల్లించానికి గరిష్ఠంగా 5 ఏళ్లు గడువు ఇవ్వబడుతుందని స్పష్టం చేసింది. ఈ రుణాల వాయిదాలు కూడా సాదాసీదాగా ఉంచడం వల్ల రైతులకు తిరిగి చెల్లించడంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉన్నాయి.

ఎలా దరఖాస్తు చేయవచ్చు..?
రైతులు పంజాబ్ నేషనల్ బ్యాంక్ శాఖకు వెళ్లి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులు ఇక్కడ ఫారమ్‌ను నింపటం ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే సమయంలో ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. దీనికోసం సదరు రైతు బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.