For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

IT Job: ఐటీ ఆశావహులకు గుడ్ న్యూస్.. 2000 మందిని రిక్రూట్ చేసుకోనున్న కంపెనీ.. పూర్తి వివరాలు..

|

IT Job: అనేక స్టార్టప్‌లు, కంపెనీలు పెద్దఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్న వేళ ఒక సాఫ్ట్‌వేర్-యాజ్-ఎ-సర్వీస్(​SaaS) కంపెనీ దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే పనిలో ఉంది. చెన్నైకి చెందిన జోహో కార్ప్ సంస్థ.. ఇంజనీరింగ్, టెక్నాలజీ, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌లో కనీసం 2,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. ఈ నియామకంలో సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, క్వాలిటీ అసెస్‌మెంట్ ఇంజనీర్లు, వెబ్ డెవలపర్లు, డిజైనర్లు, ప్రొడక్ట్ మార్కెటర్‌లు, రైటర్‌లు, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్లు, సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకుంటున్నట్లు వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే స్థానికంగా నియామకాలను ప్రారంభించింది.

కొత్త మార్కెట్లలోకి..
కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్నందున.. వివిధ దేశాల్లోని కార్యకలాపాల కోసం అక్కడి స్థానిక ఉద్యోగులను నియమించుకుంటున్నట్లు అకౌంటింగ్ & పేరోల్ హెడ్ ప్రశాంత్ గంటి తెలిపారు. ఇప్పటికే కంపెనీకి 10 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం కంపెనీ కార్యకలాపాలు భారత్ తో పాటు, అమెరికా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఇటీవల కంపెనీ ఈజిప్ట్, జెడ్డా, కేప్ టౌన్ వంటి మార్కెట్లలోకి ప్రవేశించింది. చాలా మంది ప్రతిభావంతులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వచ్చినట్లు, కంపెనీలు వీటిని అందిపచ్చుకోవాలని ఆయన అన్నారు.

profitable unicorn tamilnadu based company Zoho to recruit 2,000 employees for engineering, tech, product development​ posts

దేశంలో కార్యాలయాలు..
SaaS సంస్థ తమిళనాడులో గ్రామీణ కేంద్రాలను కలిగి ఉంది. వీటికి తోడు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని టైర్-3,4 పట్టణాల్లో కార్యాలయాన్ని ఏర్పాటు చేసే పనిలో ఉంది. ఈ క్రమంలో మరిన్ని పెట్టుబడులు కొనసాగుతాయని సంస్థ చెబుతోంది. FY21లో కంపెనీ ఆదాయం 22.3 శాతం పెరిగి రూ.5,230 కోట్లకు చేరుకుంది. అదే సంవత్సరంలో.. కంపెనీ నికర లాభం రూ.1,917.70 కోట్లుగా ఉంది. ఇది అంతకుముందు సంవత్సరం కంటే రెండింతలు ఎక్కువ. ఇది నిస్సందేహంగా భారతదేశ అత్యంత లాభదాయకమైన యూనికార్న్‌గా నిలిచింది.

English summary

IT Job: ఐటీ ఆశావహులకు గుడ్ న్యూస్.. 2000 మందిని రిక్రూట్ చేసుకోనున్న కంపెనీ.. పూర్తి వివరాలు.. | profitable unicorn tamilnadu based company Zoho to recruit 2,000 employees for engineering, tech, product development​ posts

SaaS company Zoho to recruit 2,000 employees across engineering, tech, product development​
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X