For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

QR Code: నకిలీ మందుల భరతం పట్టనున్న క్యూఆర్ కోడ్.. ఎలాగంటే..

|

తినే తిండి నుంచి కట్టుకునే బట్ట వరకు అన్నీ కల్తీ అయ్యాయి. అందుకే ఇప్పుడు బ్రాండెడ్ సరకులను కొనుగోలు చేస్తున్నారు. ఇందులోనూ నకిలీలు వస్తున్నాయి. ముఖ్యం దేశంలో చాలా నకిలీ మందులు బయటపడుతున్నాయి. వీటిని అరికట్టేందుకు కేంద్రం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్న మందులపై ఇకపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రణను తప్పనిసరి చేయాలని కేంద్రం భావిస్తోంది.

తొలుత 300 ఔషధాలపై

తొలుత 300 ఔషధాలపై

మందులపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయడం ద్వారా వినియోగదారులు అవి అసలైనవా, నకిలీవా గుర్తించేందుకు వీలు అవుతుందని కేంద్రం తెలిపింది. ఔషధాలు ప్యాక్‌చేసే బాటిల్స్‌, జార్‌, ట్యూబ్‌, స్ట్రిప్‌లపై ఈ క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించాల్సి ఉంటుంది. ఈ క్యూఆర్ కోడ్‌లను తొలుత 300 ఔషధాలపై ముద్రించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.

రూ.100 కంటే ఎక్కువ

రూ.100 కంటే ఎక్కువ

తొలుత రూ.100 కంటే ఎక్కువ విలువైన ఔషధాలపై క్యూఆర్‌ కోడ్‌ ముద్రించి.. అనంతరం మిగిలిన మందులకూ విస్తరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం విస్తృత్తంగా వినియోగించే బీపీ, యాంటీబయోటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్, విటమిన్‌ ఔషధాలను తయారుచేసే కంపెనీలకు క్యూఆర్‌ కోడ్‌ ముద్రణను తప్పనిసరి చేయనున్నట్లు సమాచారం.

ప్రత్యేక పోర్టల్

ప్రత్యేక పోర్టల్

క్యూఆర్‌ కోడ్‌తో పాటు వినియోగదారుల కోసం ఓ పోర్టల్‌ను కూడా కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ ప్రారంభించే అవకాశం ఉంది. ఈ పోర్టల్‌లో మందులపై ఉన్న ప్రత్యేకమైన కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా కూడా నకిలీలను గుర్తించవచ్చని తెలుస్తోంది.

English summary

QR Code: నకిలీ మందుల భరతం పట్టనున్న క్యూఆర్ కోడ్.. ఎలాగంటే.. | print QR code on medicines to identify fake medicines

The center intends to print QR code on medicines to identify fake medicines. By doing this, fake medicines can be easily identified, the Center said.
Story first published: Monday, October 3, 2022, 16:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X