For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PPF vs NPS: పీపీఎఫ్, ఎన్ పీఎస్ లో ఎందులో రాబడి ఎక్కువ ఉంటుంది..

|

పీపీఎఫ్, ఎన్ పీఎస్ ఈ రెండు పెట్టుబడి పథకాలు. ఇందులో ఉద్యోగులే కాకుండా ఎవరైనా పెట్టుబడి పెట్టొచ్చు. అయితే ఈ రెండింటిలో ఎందులో పెట్టుబడి పెట్టాలో చాలా మందికి గందరగోళంగా ఉంటుంది. అయితే ఈ పెట్టుబడి పథకాలు మంచివే.. అయితే ఇందులో పీపీఎఫ్ లో కచ్చితమైన రాబడి ఉంటుంది. కానీ తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే ఎన్ పీఎస్ లో ఎక్కువ రాబడి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కచ్చితంగా రాబడి వస్తుందని చెప్పలేం.

ఎందుకంటే ఇందులో రిస్క్ ఎక్కువ ఉంటుంది. తక్కువ రిస్క్ తో కచ్చితమైన రాబడి రావాలంటే పీపీఎఫ్ మంచి పెట్టుబడి ఎంపికగా నిపుణులు చెబుతున్నారు. ఎన్ పీఎస్ లో పెట్టుబడి పెడితే రిస్క్ తోపాటు రాబడి కూడా పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే ఈ రెండు పెట్టుబడి పథకాలు దీర్ఘకాలింగా ఉంటాయి. కాబట్టి ఎన్ పీఎస్ లో పెట్టుబడికి రాబడి ఎక్కువ వచ్చే అవకాశం ఉందని వివరిస్తున్నారు.

PPF vs NPS: Which investment plan is better for creating corpus

పీపీఎఫ్
పీపీఎఫ్ ప్రభుత్వ పెట్టుబడి పథకం. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీ రేటు 7.10 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇందులో పన్ను మిహాయింపు కూడా ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు 15 సంవత్సరాల మెచ్యూరిటీ పిరియడ్ ఉంటుంది. ఆ తర్వాత దీన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకోవచ్చు. ఇందులో ఏడాదికి కనీసం రూ.500 జమ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఖాతా స్తంభిస్తుంది. పీపీఎఫ్ లో నెలనెలా, మూడు నెలలకు ఓ సారి, లేదా ఆరు నెలలకు ఓ సారి లేదా సంవత్సరానికి ఒక్కసారి డిపాజిట్ చేయ్యొచ్చు. ఇందులో సంవత్సరానికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టొచ్చు. పీపీఎఫ్ నుంచి లోన్ కూడా తీసుకోవచ్చు. ఇందులో కచ్చితమైన రాబడి ఉంటుంది.

ఎన్ పీఎస్
ఎన్ పీఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీం. దీనిని PFRDA నిర్వహిస్తోంది. ఇందులో సంవత్సరానికి కనీసం రూ.1000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ఠంగా ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు. ఇందులో టైర్-1, టైర్-2 ఖాతాలు ఉంటాయి. టైర్-2 ఖాతా తెరావాలంటే కచ్చితంగా టైర్-1 ఖాతా ఉండాలి. ఇందులో 60 శాతం వరకు ఈక్విటీలో పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఇస్తారు. అందుకే ఇందులో రిస్క్ తోపాటు రాబడి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది.

English summary

PPF vs NPS: పీపీఎఫ్, ఎన్ పీఎస్ లో ఎందులో రాబడి ఎక్కువ ఉంటుంది.. | PPF vs NPS: Which investment plan is better for creating corpus

PPF or NPS, people get confused as to which would give them more return and income tax exemption.
Story first published: Friday, July 1, 2022, 15:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X