For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శుభవార్త: కొత్త PPF కొత్త రూల్స్, పీఎఫ్ మొత్తాన్ని అటాచ్ చేయలేరు

|

న్యూఢిల్లీ: ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్స్‌కు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) నిబంధలను సవరించింది. దీని ప్రకారం పీఎఫ్ అకౌంట్లోని మొత్తాన్ని అటాచ్ చేయడం ఇక నుంచి వీలుకాదు. పాత నిబంధనల స్థానంలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం 2019 కొత్త నిబంధనలు వెంటనే అమలులోకి వస్తాయని అధికారులు చెప్పారు.

అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్

అటాచ్ చేయడం వీలుకాదు

అటాచ్ చేయడం వీలుకాదు

పీఎఫ్ ఖాతాదారు బాకీ ఉన్న మొత్తాన్ని జమ చేయడం కోసం దేశంలో ఏ కోర్టు ఆర్డర్ లేదా డిక్రీ ఇచ్చినప్పటికీ పీపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తాన్ని అటాచ్ చేయడం వీలుకాదు.

అకౌంట్‌ను పొడిగించుకోవచ్చు

అకౌంట్‌ను పొడిగించుకోవచ్చు

అలాగే, మెచ్యూరిటీ తర్వాత కూడా పీఎఫ్ అకౌంట్ హోల్డర్ పీపీఎఫ్ ఖాతాను పొడిగించుకునేందుకు ఈ కొత్త నిబంధన వీలు కల్పిస్తోంది. మెచ్యూరిటీ మొత్తాన్ని పొందినప్పటికీ పీఎఫ్ కాతాదారు తన ఖాతాను కొనసాగించుకోవచ్చు. ఖాతా తెరిచిన ఏడాది చివరి నుంచి పదిహేను ఏళ్ల తర్వాత మరో ఐదు సంవత్సరాల వ్యవధికి ఖాతాను పొడిగించుకునే వీలు ఉంటుంది.

అకౌంట్ తెరిచిన సంవత్సరం చివరి నుంచి ఐదేళ్ల గడువు ముగిసిన తర్వాత ఎప్పుడైనా ఖాతా నుంచి పీపీఎఫ్ ఉపసంహరించుకునే వెసులుబాటు ఉంది. అయితే తన అకౌంట్లోని మొత్తంలో 50 శాతానికి మించకుండా లేదా అంతకుముందు ఏడాది మొత్తం.. ఇందులో ఏది తక్కువైతే దానిని విత్ డ్రా చేసుకోవచ్చు.

ఇలా తెరువొచ్చు

ఇలా తెరువొచ్చు

ఫారం 1ను సమర్పించి ఎవరైనా ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌ను తెరువొచ్చు. ఇందులో ఉమ్మడి ఖాతా వీలుకాదు. సంరక్షకులు మైనర్ లేదా మానసిక పరిస్థితి సరిగా లేని వారి తరఫున కూడా ఖాతా తెరువొచ్చు. ఇలాంటప్పుడు వారి పేరుపై ఒకే ఖాతాను తెరవచ్చు. ఖాతాదారు ఓ ఆర్థిక సంవత్సరానికి గాను కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పీఎఫ్ అకౌంట్లో జమ చేయవచ్చు.

English summary

శుభవార్త: కొత్త PPF కొత్త రూల్స్, పీఎఫ్ మొత్తాన్ని అటాచ్ చేయలేరు | PPF New rules: Account will not be liable to attachment

The Union government has notified new Public Provident Fund (PPF) rules under which the amount in the PPF account will not be liable for attachment.
Story first published: Tuesday, December 17, 2019, 15:51 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X