For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

46 ఏళ్ల కనిష్టానికి పీపీఎఫ్ వడ్డీ రేటు, 7 శాతం దిగువకు..

|

ఈ నెల చివరి నాటికి ప్రభుత్వం జూలై - సెప్టెంబర్ త్రైమాసికంలో పీపీఎఫ్ లేదా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌తో సహా చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో వడ్డీ రేట్లు మొత్తం తగ్గుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ వడ్డీ రేట్లు కూడా మరింత తగ్గనున్నాయి. ఏప్రిల్ - జూన్ క్వార్టర్‌లో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను 140 బేసిస్ పాయింట్లు తగ్గించింది. పాపులర్ స్మాల్ సేవింగ్స్ స్కీం పీపీఎఫ్ పైన వడ్డీ రేటును 80 బేసిస్ పాయింట్లు తగ్గించి 7.1 శాతానికి తగ్గించారు.

20 లక్షల ఉద్యోగాలు పోయాయ్, డీజిల్‌పై రాయితీ, టోల్ ట్యాక్స్ తొలగింపుకు డిమాండ్20 లక్షల ఉద్యోగాలు పోయాయ్, డీజిల్‌పై రాయితీ, టోల్ ట్యాక్స్ తొలగింపుకు డిమాండ్

పీపీఎఫ్ స్కీంను 1968లో ప్రారంభించారు. ఆ సమయంలో వార్షిక వడ్డీ రేటు 4.8 శాతంగా ఉంది. తర్వాత ఆర్థిక వ్యవస్థను అనుసరించి వడ్డీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. 1986 నుండి 2000 మధ్య 12 శాతానికి పైగా చేరుకున్నాయి. 2016 ఏప్రిల్ నెలలో ప్రభుత్వం పీపీఎఫ్ వడ్డీ రేట్లను క్వార్టర్లీ బేసిస్‌కు మార్చింది. అంతకుముందు ప్రతి సంవత్సరం సమీక్షించేది.

PPF interest rates may fall again, below 7% to a 46 year low

ఈసారి అంటే జూలై - సెప్టెంబర్ క్వార్టర్‌కు వడ్డీ రేటు 7 శాతం కంటే తక్కువగా చేరుకోవచ్చు. 1974 కనిష్టానికి చేరుకోనుంది. అంటే 46 ఏళ్ల కనిష్టానికి చేరుకోనుంది.

ఆయా సంవత్సరాల్లో వడ్డీ రేట్లు ఇలా...

1968 - 4.8%
1969-70 - 4.8%
1970-71 - 5%
1971-72 - 5%
1972-73 - 5%
1973-74 - 5.3%
1.4.1974 నుండి 31.7.1974 వరకు - 5.8%
1.8.1974 నుండి 31.3. 1975 వరకు - 7%
1975-76 - 7%
1976-77 - 7%
1977-78 - 7.5%
1978-79 - 7.5%
1979-80 - 7.5%
1980-81 - 8%
1981-82 - 8.5%
1982-83 - 8.5%
1983-84 - 9%
1984-85 - 9.5%
1985-86 - 10%
1.4.1986 నుండి 31.3.1999 వరకు - 12%
1.4.1999 నుండి 14.1.2000 వరకు -12%
15.1.2000 నుండి 28.2.2001 వరకు - 11%
1.3.2001 నుండి 28.2.2002 వరకు - 9.5%
1.3.2002 నుండి 28.2.2003 వరకు - 9%
1.3.2003 నుండి 30.11.2011 వరకు - 8%
1.12.2011 నుండి 31.3.12 వరకు - 8.60%
1.04.2012 నుండి 31.3.2013 వరకు - 8.80%
1.04.2013 నుండి 31.03.2016 వరకు - 8.7%

English summary

46 ఏళ్ల కనిష్టానికి పీపీఎఫ్ వడ్డీ రేటు, 7 శాతం దిగువకు.. | PPF interest rates may fall again, below 7% to a 46 year low

By this month-end, the government will fix interest rates for small savings schemes including PPF or Public Provident Fund for the next July-September quarter. And in all likelihood, we may see another cut in small savings rates amid an overall drop in interest rates in the financial system. The government had cut interest rates on small savings schemes for the April-June quarter by up to 140 basis points. The interest rate on popular small savings scheme PPF was cut by 80 basis points to 7.1%.
Story first published: Monday, June 22, 2020, 22:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X