కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాక్సీన్ కింగ్ సైరస్ పూనావాలా సంపద శరవేగంగా పెరిగింది. ఈ వైరస్ సమయంలో సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా వ్యాపారం భారీగా పెరగడంతో పూనావాలా ఆస్తి పెరుగుదల దేశంలో అత్యంత వేగవంతంగా నిలవగా, ప్రపంచంలో ఐదో వేగవంతమైన పెరుగుదలగా ఉంది.
అదే సమయంలో చమురు ధరలు పడిపోవడంతో తీవ్రంగా నష్టపోయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తిరిగి పుంజుకున్నారు.

పూనావాలాది ప్రపంచ కుబేరుల్లో 86వ స్థానం
సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత పూనావాలా సంపద 4 నెలల్లోనే ఏకంగా 25 శాతం పెరిగింది. ప్రపంచ కుబేరుల్లో 86వ స్థానంలో నిలిచారు. ఏకంగా 57 స్థానాలు ఎగబాకారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా సంపద పెరిగిన వారిలో ఐదో స్థానంలో నిలిచారు. ఈ మేరకు హూరున్ రీసెర్చ్ వెల్లడించింది. మే 31వ తేదీ నాటి వరకు ఉన్న సంపద ఆధారంగా ఈ నివేదిక తయారు చేశారు.

స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానీ సీరమ్
సీరమ్ ఇనిస్టిట్యూట్ పుణే ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తుంది. ఇది స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాలేదు. కానీ వ్యాక్సీన్ల తయారీలో ప్రపంచంలోనే అతిపెద్ద సంస్థ కావడం కలిసి వచ్చింది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ను 100 కోట్ల డోసుల తయారీ కోసం ఆస్ట్రాజెనెకాతో సీరమ్ ఒప్పందం కుదుర్చుకుంది.

టాప్ 9 నుండి 8కి ముఖేష్ అంబానీ
ఇక, కరోనా సమయంలో ముఖేష్ అంబానీ సంపద కూడా భారీగా పెరిగింది. ఆయన దేశంలో 2 స్థానంలో కొనసాగుతున్నారు. అంతకుముందు చమురు కారణంగా భారీ నష్టాలు చవిచూసినప్పటికీ, గత రెండు నెలల్లో ఆయన నికర ఆస్తుల విలువ 1800 కోట్ల డాలర్లు దాదాపు రూ.1.35 లక్షల కోట్లు పెరిగింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో వాటాల విక్రయం, రిలయన్స్ రైట్స్ ఇష్యూ తదితర కారణాలతో రూ.1.70 లక్షల కోట్లు సమీకరించడం బాగా కలిసి వచ్చింది. అయినప్పటికీ కరోనా ముందు సంపదతో పోలిస్తే ముఖేష్ ఆస్తి 1 శాతం తగ్గింది. ప్రపంచ కుబేరుల్లో మరో స్థానం ఎగబాకి, 9వ స్థానం నుండి 8కి చేరుకున్నారు. దేశీయ 100 మంది కుబేరుల్లో ముఖేష్ సంపదన మాత్రమే స్వల్పంగా తగ్గింది.

శివనాడార్, అదానీ సంపద ఎంత తగ్గిందంటే
టాప్ 100లోని మన కుబేరుల్లో హెచ్‌సీఎల్ వ్యవస్థాపకులు శివనాడార్ సంపద 16 శాతం తగ్గి 1600 కోట్ల డాలర్లకు, గౌతమ్ అదానీ ఫ్యామిలీ సంపద 18 శాతం తగ్గి 1400 కోట్ల డాలర్లకు పరిమితమైంది. సంపద పెరుగుదల విషయానికి వస్తే ఆన్ లైన్రిటైలర్లు, మెడిసిన్, గృహ సంబంధ పరికరాలు విక్రయించే రిటైలర్లు, చాకోలేట్, సోయాసాస్, పందిమాంసం ఉత్పత్తిదారుల సంపద పెరిగింది.

టాప్ 100 కుబేరుల్లో టాప్ 10
టాప్ 100లోని టాప్ 10 కుబేరులు వీరే... మార్క్ జుకర్ బర్గ్ (అమెజాన్), బిల్ గేట్స్ (మైక్రోసాఫ్ట్), బెర్నార్డ్ అర్నాల్డ్ (ఎల్వీఎంహెచ్), వారెన్ బఫెట్ (బెర్క్‌షైర్ హాత్‌వే), మార్క్ జుకర్ బర్గ్ (ఫేస్‌బుక్), స్టీవ్ బామర్ (మైక్రోసాఫ్ట్), అమన్సియో ఒర్టెగా (ఇండిటెక్స్), ముఖేష్ అంబానీ (రిలయన్స్), సెర్గీ బ్రియాన్ (గూగుల్), లారీ పేజ్ (గూగుల్) ఉన్నారు.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications