For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వచ్చే నెలలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు? PNB నుండి రూ.8000 కోట్లు ట్రాన్సుఫర్

|

దేశీయ సెకండ్ లార్జెస్ట్ పబ్లిక్ సెక్టార్ లెండర్ పంజాబ్ నేషనల్ బ్యాంకు (PNB) తన మొదటి విడత బ్యాడ్ లోన్ మొత్తం రూ.8,000 కోట్లను జూలై నెలలో బ్యాడ్ బ్యాంకు - ది నేషనల్ అసెట్ రీ-కన్స్‌ట్రక్షన్ కంపెనీ (NARCL)కి ట్రాన్సుఫర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ మల్లికార్జున రావు వెల్లడించారు.

మొండి బ‌కాయిల‌ను వ‌సూలు చేసేందుకు కేంద్రం ప్ర‌తిపాదించిన NARCL/బ్యాడ్ బ్యాంకు త్వ‌ర‌లో ప్రారంభం కానుందా అంటే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బ్యాడ్ బ్యాంకు NARCL త్వరలో ఏర్పాటు కానుందని అర్థం అవుతోంది. ఇందులోకి బ‌దలీ చేసేందుకు రూ.8,000 కోట్ల మొండి బకాయిలను PNB గుర్తించింది.

PNB to transfer Rs 8,000 crore loans to bad bank by July

అన్ని బ్యాంకుల త‌ర‌ఫున NARCL ఏర్పాటవుతుందని మల్లికార్జున రావు తెలిపారు. రుణాల రిక‌వ‌రీకి అన్ని బ్యాంకులు త‌మ ఎన్పీఏలను NARCLకు బ‌దిలీ చేస్తాయని, ఎస్బీఐ త‌ర్వాత స్థానంలో PNB ఉంటుందని చెప్పారు. ప్ర‌తి బ్యాంకు 10 శాతం లోపు వాటా క‌లిగి ఉంటాయి. వచ్చే నెల నుండి బ్యాడ్ బ్యాంకు ప్రారంభం కావొచ్చునన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు నెలాఖరు నాటికి పూర్తవుతాయన్నారు.

తొలి దశలో NARCLకు బదలీ చేసేందుకు రూ.8వేల కోట్ల మొండి బకాయిలను గుర్తించామని, మొత్తం మొండి బకాయిల వ్యాల్యూ రూ.84వేల కోట్లుగా గుర్తించామని, వాటిని NARCLకు బదలీ చేస్తామన్నారు. బ్యాడ్ బ్యాంకుకు సరిపడా నిధులు ఉన్నాయన్నారు. ఫ్రాడ్ లోన్స్‌ను బ్యాడ్ బ్యాంకుకు బదలీ చేయవద్దని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.

English summary

వచ్చే నెలలో బ్యాడ్ బ్యాంకు ఏర్పాటు? PNB నుండి రూ.8000 కోట్లు ట్రాన్సుఫర్ | PNB to transfer Rs 8,000 crore loans to bad bank by July

India's second-largest public sector lender Punjab National Bank (PNB) will transfer the first tranche of bad loans valued at Rs 8,000 crore to the proposed bad bank - the National Asset Reconstruction Company (NARCL) next month, according to the bank’s managing director SS Mallikarjuna Rao.
Story first published: Monday, June 7, 2021, 18:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X