For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో స్కాం, రూ.2060 కోట్ల ఫ్రాడ్

|

ప్రభుత్వరంగ పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)కు సంబంధించి మరో మోసం బయటపడింది. నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ స్కాం తర్వాత అయిదేళ్లకు మరో ఫ్రాడ్ వెలుగు చూసింది. ఐఎల్అండ్ ఎఫ్ఎస్ ద్వారా తమిళనాడు పవర్ కంపెనీ తీసుకున్న రూ.2,060.14 కోట్లు మొండి బకాయిగా మారింది. ఈ స్కాం లార్జ్ కార్పోరేట్ బ్యాంకు ఢిల్లీ శాఖలో వెలుగు చూసింది.

క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబి నిబంధనల ప్రకారం మంగళవారం రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది పంజాబ్ నేషనల్ బ్యాంకు. పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు తర్వాత ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తమిళనాడు పవర్ కంపెనీ రుణాలను మొండి బకాయిగా ప్రకటించిన బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు.

PNB Hit by Another Scam, Reports Rs 2060 Crore Fraud by Tamil Nadu Company

అంతకుముందు పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు ఫిబ్రవరి 15వ తేదీన ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తమిళనాడు పవర్‌ను బ్యాడ్ అసెట్‌గా ప్రకటించింది. రూ.148 కోట్ల రుణాలు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ తమిళనాడు పవర్... తమిళనాడులోని కడలూరులోని థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ అమలు కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా ఏర్పాటు చేయబడిన స్పెషల్ పర్సప్ వెహికిల్.

English summary

పంజాబ్ నేషనల్ బ్యాంకులో మరో స్కాం, రూ.2060 కోట్ల ఫ్రాడ్ | PNB Hit by Another Scam, Reports Rs 2060 Crore Fraud by Tamil Nadu Company

State owned lender Punjab National Bank has reported a fraud in borrowing worth over Rs 2,000 crore in the NPA (non-performing asset) account of IL&FS Tamil Nadu Power. The incident has happened at the Extra Large Corporate Branch in Delhi zonal office, the bank said.
Story first published: Wednesday, March 16, 2022, 16:15 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X