For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పంటబీమా నిర్ణయం ఇక రైతులదే, గడువులోగా ప్రీమియం చెల్లించకుంటే..

|

పంట బీమాలో చేరాలా వద్దా అనేది ఇక నుండి రైతు ఇష్టం. ఈ మేరకు కేంద్రమంత్రి మండలి నిర్ణయించింది. ప్రధానమంత్రి పంటల బీమా, వాతావరణ ఆధారిత పంటల బీమా పథకాలలో మార్పులు చేస్తూ మోడీ అధ్యక్షతన కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రుణాలు తీసుకున్న రైతులు అందరూ విధిగా ఇందులో చేరాలనే నిబంధనను సడలిస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. ఈ స్కీం అమలుకు మూడేళ్ల కాలపరిమితితో టెండర్లు పిలవాలని చెప్పారు.

పెన్షన్ నిబంధనల్లో భారీ మార్పులు, మోడీ ప్రభుత్వం కీలక నిర్ణయం

పంటబీమా.. మార్పులు

పంటబీమా.. మార్పులు

PMFBY స్కీం కింద ఖరీఫ్ పంటకు 2 శాతం, రబీ పంటకు 1.5 శాతం, ఉద్యానవన, వాణిజ్య పంటలకు 5 శాతం చొప్పున చాలా తక్కువ ప్రీమియం రేటుతో నివారించలేని సహజ నష్టాలకు పంట బీమాను అందిస్తోంది. ఇఫ్పుడు PMFBY, వాతావరణ ఆధారిత పంటల బీమా (RWBCIS) పథకాల్లో తదనుగుణంగా మార్పులు చేసింది. ఈ మార్పులు 2020 ఖరీఫ్ నుండి అమలులోకి వస్తాయి.

రైతుల ఇష్టం..

రైతుల ఇష్టం..

ఈ రెండు పథకాలలో ఎన్‌రోల్ చేసుకోవడం ఇక నుండి రైతుల ఇష్టమని కేంద్రమంత్రి తోమర్ వెల్లడించారు. ప్రస్తుతం 58 శాతం మంది రైతులు రుణ గ్రహీతలను, 42 శాతం మందికి రుణాలు లేవని చెప్పారు. ఈ చర్యతో క్రాప్ ఇన్సురెన్స్‌ను ఎంచుకునే రైతుల సంఖ్య తగ్గిపోవచ్చునని, కానీ చివరకు పెరుగుతుందన్నారు.

రైతులకు అవగాహన కల్పిస్తాం

రైతులకు అవగాహన కల్పిస్తాం

పంట బీమాను తీసుకోవాల్సిన అవసరం గురించి రైతులకు తెలియ చెబుతామని తోమర్ అన్నారు. ఇందుకోసం రైతులకు అవగాహన కల్పిస్తామని, పెద్ద ఎత్తున ప్రచారం చేస్తామన్నారు. ఈ నిర్ణయం ద్వారా రైతు సంఘాలు, రాష్ట్రాలు లేవనెత్తిన సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎప్పుడు చేరాలి?

ఎప్పుడు చేరాలి?

ఖరీఫ్ పంటల బీమా ప్రీమియంను మార్చి 31వ తేదీ లోపు, రబీ ప్రీమియంను సెప్టెంబర్ 30వ తేదీ లోపు రాష్ట్రాలు చెల్లించాలి. లేదంటే ఈ పథకంలో చేరేందుకు అనుమతించరు.

రెండంచెల విధానం

రెండంచెల విధానం

పంట నష్టాన్ని అంచనా వేసిన అనంతరం పరిహారాన్ని నిర్ణయించడానికి రెండంచెల విధానాన్ని అవలంభిస్తారు.

టెక్నికల్ పరిష్కారాల ఆధారంగా పరిహారం

టెక్నికల్ పరిష్కారాల ఆధారంగా పరిహారం

నిర్ధారిత సమయంలోపు రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టం వివరాలు ఇన్సురెన్స్ కంపెనీలకు అందించకుంటే సదరు సంస్థలు టెక్నికల్ పరిష్కారాల ఆధారంగా అంచనా వేసి పరిహారం అందిస్తాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు గగడువులోగా ప్రీమియం సబ్సిడీలో తమ వాటాను చెల్లించడంలో విఫలమైతే తర్వాత సీజన్‌లో ఈ పథకాన్ని అమలు చేయడానికి అనుమతించరు. బీమా సంస్థలు రైతులకు చెల్లింపులు జరపడంలో ఆలస్యానికి కారణం ఏమంటే.. రాష్ట్రాలు తమ ప్రీమియం మొత్తాన్ని అందించకపోవడం వల్ల ఆలస్యానికి కారణంగా మారుతోంది.

కేంద్రం రాయితీ ఇలా..

కేంద్రం రాయితీ ఇలా..

PMFBY, RWBCIS రేట్లలో కేంద్ర రాయితీ.. మెట్ట ప్రాంతానికి 30 శాతం, మాగాణి ప్రాంతానికి 25 శాతానికి పరిమితం అవుతుంది. 50 శాతం మించి మాగాణి ప్రాంతం ఉన్న జిల్లాను పూర్తిగా సాగునీటి వసతి ఉన్న ప్రాంతంగా గుర్తిస్తారు. స్థానిక పరిస్థితులకు తగినట్లు మార్పులు చేసుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉంటుంది. వాతావరణ ప్రతికూలతలు, సీజన్ మధ్యలో వచ్చే ఇబ్బందులు, పంట కోతల తర్వాత తలెత్తే నష్టాల వంటి వాటిని రాష్ట్రాలు ఈ బీమా పరిధిలో చేర్చుకోవచ్చు. వడగండ్ల వాన నుండి రక్షణకూ బీమా వర్తింప చేయవచ్చు. 10,000 రైతు ఉత్పత్తి సంఘాల ఏర్పాటుకు రూ.4,496 కోట్ల బడ్జెట్‌ను కేబినెట్ కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. 2019-20 నుండి 2023-24 కాలానికి కేటాయించింది.

English summary

PMFBY crop insurance schemes voluntary for farmers

The Centre has almost halved its contribution to its own flagship crop insurance schemes, slashing its share of the premium subsidy from the current 50% to just 25% in irrigated areas and 30% for unirrigated areas from the kharif season of 2020.
Story first published: Thursday, February 20, 2020, 15:09 [IST]
Company Search
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Goodreturns sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Goodreturns website. However, you can change your cookie settings at any time. Learn more