For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

pm kisan: రైతులకు కేంద్రం శుభవార్త.. ఏపీ కర్షకులకు మాత్రం డబల్ ధమాకా..

|

pm kisan: వ్యవసాయ రంగం భారతదేశానికి వెన్నెముక వంటిది. దేశంలోని అధిక జనాభా ఈ విభాగానికే పరిమితమయ్యారు. ఎన్నికల వేళ ప్రధాని మోడీ సైతం, వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కిన విషయం తెలిసిందే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం వివిధ రకాల పథకాలను రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వాటిలో ముఖ్యమైనది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. తాజాగా ఈ పథకానికి సంబంధించి మోడీ సర్కారు శుభవార్త చెప్పింది.

13వ విడత విడుదల:

13వ విడత విడుదల:

PM కిసాన్ లబ్ధిదారులకు 13వ విడత నిధులను.. కర్ణాటకలోని బెళగావించి నుంచి ప్రధాని మోడీ సోమవారం విడుదల చేశారు. మొత్తం రూ.16 వేల కోట్ల ద్వారా 8 కోట్లకు పైగా రైతులు లబ్ధి పొందనున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని మొదటగా ప్రారంభించారు. ప్రతి 4 నెలలకు ఒకసారి.. సొంత పంటభూమి ఉన్న ఒక్కో రైతు కుటుంబానికి రూ.2 వేల చొప్పున మొత్తం ఏడాదికి రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ నాలుగేళ్లలో ఇప్పటివరకు 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు రూ.2.2 లక్షల కోట్లను పంపిణీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

కర్షకుల ఆదాయం పెంపునకు:

కర్షకుల ఆదాయం పెంపునకు:

రైతులకు పెట్టుబడికోసం కొంత మొత్తాన్ని సాయంగా అందించి, వారి ఆదాయాన్ని మరింత పెంచాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ రంగ అభివృద్ధికి పీఎం కిసాన్ యోజన మరింత ఊతమిస్తుందని అభిప్రాయపడింది. కొన్ని ప్రమాణాలకు లోబడి, దేశంలోని రైతులందరూ ఈ పథకం కింద అర్హులేనని వెల్లడించింది. ఈ నిధులు గ్రామీణ ఆర్థికవృద్ధికి, రైతులకు రుణ పరిమితి సడలింపునకు, వ్యవసాయ పెట్టుబడిని తగ్గించేందుకు ఉపయోగపడుతున్నాయని పేర్కొంది.

ఏపీ రైతులకు మరో శుభవార్త:

ఏపీ రైతులకు మరో శుభవార్త:

కేవలం వ్యవసాయం కోసమే కాకుండా పలువురు ఈ నిధులను విద్య, వైద్యం, సంరక్షణ, వివాహాలు వంటి ఇతర ఖర్చులను తీర్చుకోవడానికి సైతం వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన PM కిసాన్ లబ్ధిదారులకు రూ.2 వేలే కాకుండా కొంత ఎక్కువ మొత్తం అందనుంది. ఈ పథకానికి అదనంగా రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం సైతం కొంత మొత్తాన్ని కలిపి కర్షకుల ఖాతాల్లో జమ చేయనుండడమే ఇందుకు కారణం. అతి త్వరలోనే ఈ మొత్తం రైతు ఖాతాల్లోకి చేరుతుందని అధికారులు స్పష్టం చేశారు.

English summary

pm kisan: రైతులకు కేంద్రం శుభవార్త.. ఏపీ కర్షకులకు మాత్రం డబల్ ధమాకా.. | PM Modi released PM Kisan 13th term payment for beneficiaries

PM Kisan release
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X