For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fact Check: ఆధార్ ఉంటే రూ.4,78,000 రుణం..! క్లారిటీ ఇచ్చిన పీఐబీ..

|

దేశవ్యాప్తంగా దాదాపు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉంది. అయితే ఈ ఆధార్ కార్డుకు సంబంధించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా మీకు ఆధార్ కార్డు ఉంటే ప్రభుత్వం ద్వారా రూ.4,78,000 రుణం ఇస్తుందని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. దీనిపై PIB స్పందించింది.

ఇందుకు సంబంధించి పీఐబీ తన అధికారిక ట్వీట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ వైరల్ సందేశం వాస్తవాన్ని నిర్ధారించిన తర్వాత, ఈ పోస్ట్ పూర్తిగా నకిలీదని PIB స్పష్టం చేసింది. అలాంటి స్కీమ్ ఏదీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని పేర్కొంది. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ తన దర్యాప్తులో ఈ వార్త నకిలీదని తేలింది. దీంతో పాటు ఇలాంటి వైరల్ పోస్ట్‌లను షేర్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.

PIB has clarified that the news that Aadhaar card holders will get a loan of Rs.4,78,000 is fake.

సోషల్ మీడియా యుగంలో చాలా సార్లు తప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. మీ సోషల్ మీడియా ఖాతా లేదా వాట్సాప్‌లో వస్తున్న వార్తలపై మీకు అనుమానం ఉంటే, మీరు PIB ద్వారా వాస్తవాన్ని తనిఖీ చేయవచ్చు. దీని కోసం మీరు అధికారిక లింక్ https://factcheck.pib.gov.in/ సందర్శించాలి . ఇది కాకుండా, మీరు వాట్సాప్ నంబర్ 8799711259 లేదా ఇమెయిల్ : [email protected] కు సమాచారాన్ని పంపవచ్చు.

English summary

Fact Check: ఆధార్ ఉంటే రూ.4,78,000 రుణం..! క్లారిటీ ఇచ్చిన పీఐబీ.. | PIB has clarified that the news that Aadhaar card holders will get a loan of Rs.4,78,000 is fake.

A news on social media goes viral that the government will give a loan of Rs.4,78,000 if you have an Aadhaar card. PIB responded to this. PIB responded to this.
Story first published: Sunday, November 20, 2022, 16:00 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X