For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

టాటా పవర్ ‘ఇన్విట్’లో పెట్రోనాస్ పెట్టుబడి..? 250 మిలియన్ డాలర్లు, మొత్తం 51 శాతం షేర్...

|

టాటా పవర్‌కి చెందిన ఇంధన మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్ట్ (ఇన్విట్)లో పెట్టుబడి పెట్టేందుకే మలేషియాకు చెందిన చమురు గ్యాస్ కంపెనీ పెట్రోలియం నేషనల్ బిడ్ (పెట్రోనాస్) సుముఖంగా ఉంది. ఇందుకోసం టాటా గ్రూపుతో చర్చలు జరుపుతోంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ టాటా పవర్ యొక్క అనుబంధ సంస్థ.. దేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ కంపెనీ. తమ సంస్థలో 500 నుంచి 750 మిలియన్ డాలర్ల పెట్టుబడిని సమీకరించాలని చూస్తోంది. ఇందుకోసం పలు సంస్థలతో చర్చలు జరిపినట్టు ఇదివరకు ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ చేసింది.

ఇదివరకు కేకేఆర్, బుక్ ఫీల్డ్, ముబాడల, ఓమర్స్, జర్మనీకి చెందిన అలియాంజ్ ఇతర కంపెనీలు కూడా టాటా పవర్‌తో సంప్రదింపులు జరిపాయి. కంపెనీలో గల 51 శాతం వాటాను విక్రయించాలని టాటా పవర్ భావిస్తోంది. సంస్థలతో చర్చలు సఫలమైతే టాటా పవర్.. లార్సన్ అండ్ టుబ్రో, రిలయన్స్ ఇండస్ట్రీస్, స్టెరిలైట్, పిరమల్ ఇండస్ట్రీస్‌లో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. ఇందుకోసం ఐసీఐసీఐ సెక్యూరిటీస్, సిటీ సంస్థలు టాటా పవర్‌కు సలహాలు కూడా ఇస్తున్నాయి.

Petronas eyes stake in Tata Powers InvIT..

పెట్టుబడి గురించి ఇన్విట్‌తో పెట్రోనాస్ చర్చలు జరుగుతున్నాయి. ఇన్విట్‌లో 3 నుంచి నాలుగు పెట్టుబడి దారులు చేరతారని సంకేతాలు ఇచ్చారు. బ్రిటన్‌కు చెందిన సీడీసీ గ్రూప్, ఐఎఫ్‌సీ వాషింగ్టన్, సవరాన్ వెల్త్ ఫండ్స్ వంటి కొన్ని సంస్థలు సహా పెట్టుబడిదారులుగా బోర్డులోకి వచ్చే అవకాశం ఉంది. ఏసియా డెవలప్ మెంట్ బ్యాంక్ నుంచి డీఈషీ, యూకే నుంచి సీడీసీ, ఫ్రాన్స్ నుంచి ప్రొపార్కో, ఐఎఫ్‌సీ వాషింగ్టన్, ఇతర సంస్థలు కూడా పెట్టుబడి అవకాశాలను పరిశీలిస్తున్నాయి. కానీ పెట్రోనాస్ ఒక్క కంపెనీ మాత్రమే 200 నుంచి 250 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు ఇన్విట్‌తో చర్చలు జరుగుతున్నాయి.

English summary

టాటా పవర్ ‘ఇన్విట్’లో పెట్రోనాస్ పెట్టుబడి..? 250 మిలియన్ డాలర్లు, మొత్తం 51 శాతం షేర్... | Petronas eyes stake in Tata Power's InvIT..

tata Power has been looking to raise $500-750 million for its clean energy platform and had initiated discussions with several investors. petronas will buy major share.
Story first published: Saturday, June 6, 2020, 16:42 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X