For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Petrol Price Today: పెట్రోల్, డీజిల్ తగ్గుదలకు మరింత వెయిట్

|

పెట్రోల్, డీజిల్ ధరలకు సంబంధించి సామాన్యుడికి రిలీఫ్. గవర్నమెంట్ ఆయిల్ కంపెనీ ఇండియా ఆయిల్(IOCL) చమురు ధరలకు సంబంధించి నేడు (జనవరి 10, 2022) కొత్త ధరలను విడుదల చేశాయి. అయితే ధరల్లో ఎలాంటి మార్పులేదు. దేశీయ చమురు మార్కెటింగ్ సంస్థలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ధరలను సవరిస్తాయి. దాదాపు రెండు నెలలుగా చమురు ధరల్లో మార్పులేదు. అయితే క్రూడ్ ధరలు తగ్గిన తర్వాత మాత్రమే ఇక్కడ ధరలు తగ్గుతాయి.

గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించిన అనంతరం ధరలు తగ్గాయి. దీపావళికి ముందు మోడీ ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి ఆ పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది. పలు రాష్ట్రాలు కూడా కేంద్రం బాటలో నడిచి ధరలు తగ్గించాయి. తెలుగు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ఢిల్లీలోను అక్కడి ప్రభుత్వం వ్యాట్‌‍ను తగ్గించింది. వ్యాట్‌ను ముప్పై శాతం నుండి 19.40 శాతానికి తగ్గించింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర రూ.8 తగ్గింది. ఇటీవలే జార్ఖండ్ ప్రభుత్వం టూవీలర్స్‌కు లీటర్ పెట్రోల్ పైన రూ.25 తగ్గింపును అమలు చేసింది. వివిధ నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి.

Petrol Price Today: People hoping for cheap petrol and diesel will have to wait

లీటర్ పెట్రోల్ ధర ఢిల్లీలో రూ.95.41, చెన్నైలో రూ.101.40, కోల్‌కతాలో రూ.104.67, ముంబైలో రూ.109.98, హైదరాబాద్‌లో రూ.108.20, విశాఖపట్నంలో రూ.109.05గా ఉంది. లీటర్ డీజిల్ ఢిల్లీలో రూ.86.67, చెన్నైలో రూ.91.43, కోల్‌కతాలో రూ.89.79, ముంబైలో రూ.94.14, హైదరాబాద్‌లో రూ.94.62, విశాఖపట్నం రూ.95.18గా ఉంది.

ఒమిక్రాన్ తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పైకి, కిందకు కదులుతున్నాయి. భారీగా పెరుగుతూ, అంతేస్థాయిలో పడిపోతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లో ధరలు తగ్గుతాయని భావిస్తున్నారు. అయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గగానే ఇక్కడ తగ్గవు.

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రభావం చమురు మార్కెట్ పైన ఉంటోంది. వినియోగం తగ్గుతుందనే భయంతో చమురు ధరలు ప్రారంభంలో పడిపోయాయి. ఆ తర్వాత భారీగా పెరిగాయి. ఆగస్ట్ నెల నుండి ఓ వారంలో గరిష్ట పెరుగుదలను గత నెలలో నమోదు చేశాయి. ఓ విధంగా ఊగిసలాటలో ఉన్నాయి. అయితే కొత్త క్యాలెండర్ ఏడాదిలో మాత్రం పెరుగుతున్నాయి. నిన్న భారీగా పెరిగింది. నేడు బ్రెంట్ క్రూడ్ ధర 81.75 డాలర్ల వద్ద, యూఎస్ వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ 78.90 డాలర్ల వద్ద ఉంది. అంతర్జాతీయంగా ఇలాగే స్థిరంగా పెరిగితే మన వద్ద ధరలు పెరిగే అవకాశాలు ఉంటాయి.

English summary

Petrol Price Today: పెట్రోల్, డీజిల్ తగ్గుదలకు మరింత వెయిట్ | Petrol Price Today: People hoping for cheap petrol and diesel will have to wait

People waiting for cheap petrol and diesel will have to wait longer. There has been no change in the prices since last one month. Market experts expected the fuel price to come down further as crude became cheaper. But at present the waiting period of cheap petrol and diesel is increasing.
Story first published: Monday, January 10, 2022, 7:21 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X